Current Affairs Telugu Daily

ఉత్తర కొరియా ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి హ్వాసాంగ్‌-14 పరీక్ష
అణ్వస్త్ర, క్షిపణి పరీక్షలతో ప్రపంచానికి కునుకులేకుండా చేస్తున్న ఉత్తరకొరియా మరోసారి కవ్వింపు చర్యకు దిగింది. ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి హ్వాసాంగ్‌-14ను విజయవంతంగా పరీక్షించినట్లు 2017 జులై 4న ప్రకటించింది. దీంతో అమెరికాను తాకే అణ్వస్త్రాన్ని అభివ ద్ధి చేయాలన్న ఉత్తరకొరియా పెద్ద ముందడుగు వేసినట్లయింది. అమెరికా తన స్వాతంత్య్ర దినోత్సవానికి సన్నాహాలు చేసుకుంటున్న సమయంలో ఈ పరీక్ష నిర్వహించింది. ఈ క్షిపణికి అమెరికాలోని అలాస్కాను తాకే సామర్థ్యం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఉత్తర పాంగ్యాన్‌ ప్రావిన్స్‌లోని ఒక ప్రయోగ వేదిక నుంచి ఈ క్షిపణి ప్రయోగం జరిగిందని, తూర్పు సముద్రం (జపాన్‌ సముద్రం)లో ఇది పడిరదని దక్షిణ కొరియా సైన్యం పేర్కొంది. 
views: 848

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams