Current Affairs Telugu Daily

మూడు ప్రాజెక్టులను ప్రారంభించిన మోదీ
గుంటూరు పర్యటనలో ప్రధాని మోదీ మూడు కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రారంభించారు. విశాఖలో రూ.1178 కోట్లతో నిర్మించిన  వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రాన్ని జాతికి అంకితం చేశారు.
 కృష్ణపట్నం పోర్టు వద్ద రూ.700 కోట్లతో నిర్మించిన బీపీసీఎల్‌ టర్మినల్‌ శంకుస్థాపన చేశారు. అమలాపురం వద్ద ఓఎన్‌జీసీ వశిష్ట, ఎస్1 ఆన్‌షోర్‌ ప్రాజెక్టును రిమోట్‌ ద్వారా ప్రారంభించారు.
ప్రాజెక్టుల వివరాలు..
ప్రాజెక్టు: వ్యూహాత్మక చమురు నిల్వ కేంద్రం
ప్రాంతం: విశాఖపట్నం
నిల్వ సామర్థ్యం: 1.33 మిలియన్‌ మెట్రిక్‌టన్నులు
అంచనా వ్యయం: రూ.1,178.35 కోట్లు
ప్రత్యేకత: తీర ప్రాంతాల్లో మూడుచోట్ల ముడిచమురు నిల్వ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 
ఐఎస్‌పీఆర్‌ఎల్‌, ఓఐడీబీ, కేంద్ర ఇంధన, సహజ వాయువులు, ఇంజినీరింగ్‌ మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టుని చేపట్టాయి. ఈ చమురు నిల్వ కేంద్రం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రిఫైనరీలకు పైపులైన్లు, నౌకల్లో సరఫరా అయ్యేలా ఏర్పాట్లు చేశారు.
ప్రాజెక్టు: పెట్రో కోస్టల్‌ టెర్మినల్‌
విస్తీర్ణం: 100 ఎకరాలు
ప్రాంతం: కృష్ణపట్నం
అంచనా వ్యయం: రూ.700 కోట్లు
ప్రత్యేకత: దేశంలోని మూడో అతిపెద్ద చమురు కంపెనీల్లో ఒకటైన భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ సంస్థ (బీపీసీఎల్‌) కృష్ణపట్నంలో చమురు సమీకరణ, నిల్వ, పంపిణీల కోసం ప్రత్యేక టెర్మినల్‌ను ఏర్పాటు చేస్తోంది.
 ప్రత్యేకించి మోటార్‌ స్పిరిట్‌, ఇథనాల్‌, హైస్పీడ్‌ డీజిల్‌, బయో డీజిల్‌ను ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు సరఫరా చేయనున్నారు.
ప్రాజెక్టు: గ్యాస్‌ ఫీల్డ్‌ డెవలప్‌మెంట్‌
ప్రాజెక్టు ప్రాంతం: కేజీ బేసిన్‌
అంచనా వ్యయం: రూ.5,300 కోట్లు
ప్రత్యేకత: కేజీ బేసిన్‌లోని ఓఎన్‌జీసీ నిర్వహిస్తున్న వశిష్ట ఎస్‌1 బావి నుంచి చమురుని వెలికితీసే ఆఫ్‌షోర్‌ డెవలప్‌మెంట్‌ ప్రాజెక్టు సిద్ధమైంది.
 అమలాపురం సమీపంలోని తీరప్రాంతంలో ఏర్పాటైన బావుల నుంచి చమురు వెలికి తీయనున్నారు. తొమ్మిదేళ్లలో 9.56బిలియన్‌ క్యూబిక్‌ మీటర్ల చమురును ఇక్కడ ఉత్పత్తి చేయొచ్చని అంచనా వేస్తున్నారు.

views: 1199

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams