Current Affairs Telugu Daily

జన్‌ధన్‌ ఖాతాల్లో రూ.90వేల కోట్ల డిపాజిట్లు
  • జన్‌ధన్‌ ఖాతాల్లో ప్రజల డిపాజిట్ల మొత్తం త్వరలో రూ.90వేల కోట్లు దాటనుంది.  
  • ప్రభుత్వం ఈ ఖాతాదారులకు రూ.2లక్షల మేరకు ప్రమాద బీమా కల్పించడం ప్రజలను ఆకర్షిస్తోంది. దీంతో భారీ సంఖ్యలో కొత్తగా ఖాతాలను తెరుస్తున్నారు. 
  • ఆర్థిక మంత్రిత్వ శాఖ లెక్కల ప్రకారం జనవరి 30 నాటికి ఈ ఖాతాల్లో జమైన మొత్తం రూ.89,257.57కోట్లుగా ఉంది. ముఖ్యంగా మార్చి 2017 నుంచి ఈ ఖాతాల్లో జమ చేసిన మొత్తం పెరుగుతూ వస్తోంది.
  • ప్రధాన మంత్రి జన్‌ ధన్‌ యోజనాను 2014 ఆగస్టు 28 ప్రారంభించారు. దీనిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని అమలు చేయాలని నిర్ణయించారు. 
  • గత ఏడాది ఆగస్టు 28 తర్వాత నుంచి ఈ ఖాతాదారులకు అందించే ప్రమాద బీమా మొత్తాన్ని రూ.2లక్షలకు పెంచారు. 
  • ఓవర్‌ డ్రాఫ్ట్‌ మొత్తాన్ని కూడా రూ.10వేలు చేశారు. ఈ పథకం ప్రారంభించిన మొదట్లో ప్రతి ఇంటికీ ఒక ఖాతా అనే లక్ష్యంతో దీనిని ప్రారంభించారు. ఆ తర్వాత ప్రతి వ్యక్తికి ఒక ఖాతాగా మార్చారు. 
  • ఇప్పటి వరకు అందుబాటలో ఉన్న సమాచారం మేరకు ఈ మొత్తం 341.4 మిలియన్ల ఖాతాలను ప్రారంభించారు.

views: 851

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams