Current Affairs Telugu Daily

క్రెడిట్‌ కార్డుల బిల్లుల చెల్లింపులకు రూ.2 లక్షల నగదు పరిమితి మినహాయింపు
రూ.2 లక్షలు, అంతకుమించిన నగదు జమ లావాదేవీలపై విధించిన పరిమితుల నుంచి క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులకు మినహాయింపు లభించింది. 2017 ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వచ్చిన ఆర్థిక చట్టం ప్రకారం రూ.2 లక్షలు, అంతకుమించి నేరుగా నగదు లావాదేవీలు నిర్వహించటం నిషేధం. అయితే, దీనికి ఆదాయపు పన్ను శాఖ అయిదు మినహాయింపులు ఇచ్చింది. ఈ జాబితాలో తాజాగా క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపులను కూడా చేర్చారు. దీని వల్ల క్రెడిట్‌ కార్డు బిల్లుల చెల్లింపుదారులకు వెసులుబాటు కలుగుతుంది.
views: 894



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams