Current Affairs Telugu Daily

ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా లద్దాఖ్‌
కశ్మీర్‌ డివిజన్‌లో భాగంగా ఉంటూ వచ్చిన లద్దాఖ్‌ ఇప్పుడు ప్రత్యేక రెవెన్యూ డివిజన్‌గా అవతరించింది. ఫిబ్రవరి 8 నుంచి కొత్త డివిజన్‌ అమల్లోకి వస్తుందని జమ్మూకశ్మీర్‌ అధికార యంత్రాంగం వెల్లడించింది. మిగతా డివిజన్‌ల మాదిరే లద్దాఖ్‌కు ప్రత్యేక డివిజినల్‌ కమిషనర్‌, ఇన్‌స్పెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ పోలీస్‌ (ఐజీ), వారికి పూర్తిస్థాయి సిబ్బంది ఉంటారని అందులో పేర్కొంది. కార్గిల్‌, లేహ్‌ జిల్లాలు దీని పరిధిలోకి వస్తాయని, లేహ్‌ కేంద్రంగా ఈ డివిజన్‌ ఉంటుందని అధికారులు వెల్లడించారు. డివిజన్‌ ఆవిర్భావంతో ‘లద్దాఖ్‌ స్వతంత్ర పర్వతాభివృద్ధి మండళ్ల (ఎల్‌ఏహెచ్‌డీసీ)’ చిరకాల డిమాండ్‌ తీరినట్టయింది.
views: 710

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams