Current Affairs Telugu Daily

భారత ప్రధాని నరేంద్రమోడి ఇజ్రాయెల్‌ పర్యటన మొదటి రోజు
భారత ప్రధాని నరేంద్రమోడి మూడు రోజుల పర్యటన నిమిత్తం 2017 జులై 4న ఇజ్రాయెల్‌ చేరుకున్నారు. ఆయన జులై 6 వరకు ఇజ్రాయెల్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలతో నరేంద్రమోడి ఇజ్రాయెల్‌ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా చరిత్ర సృష్టించారు. జెరూసలెంలోని బెన్‌ గురియన్‌ విమానాశ్రయంలో ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి స్వయంగా విమానాశ్రయానికి వచ్చి మోడికి స్వాగతం పలికారు. ప్రొటోకాల్‌ను పక్కనపెట్టి ఇప్పటి వరకు కేవలం అమెరికా అధ్యక్షుడు, పోప్‌కు మాత్రమే ఇజ్రాయెల్‌ స్వాగతం పలికింది. ఇపుడు ఈ గౌరవం భారత ప్రధాని కూడా లభించినట్లయింది. 
views: 671

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams