Current Affairs Telugu Daily

పశు సంరక్షణ, గోశాలలకు రూ. 612 కోట్ల కేటాయింపు
పశు సంరక్షణ, గోశాలల ఏర్పాటుకు ఉత్తర్‌ప్రదేశ్‌ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 612.6 కోట్లు కేటాయించింది. 
2019-20 సంవత్సరానికి గాను రూ. 4.79 లక్షల కోట్లతో ప్రభుత్వం  బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. 
అయోధ్యకు ప్రత్యేకంగా రూ.301 కోట్లు కేటాయించింది. నగరంలో విమానాశ్రయం, పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి ఈ నిధులు వెచ్చిస్తారు.
 పశువులు తమ పంటలను పాడుచేస్తుండటంతో యూపీలో రైతులు వాటిని బడుల్లోనూ, ప్రజారోగ్య కేంద్రాల్లోనూ కట్టేస్తున్నట్లు వార్తలొచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం పశువుల కోసం నిధులు కేటాయించింది. 
ఇందులో రూ. 247.60 కోట్లను గ్రామీణ ప్రాంతాల్లో గోశాలల నిర్మాణం, నిర్వహణకు వినియోగించనున్నట్లు రాష్ట్ర ఆర్థిక మంత్రి  తెలిపారు.

views: 737

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams