Current Affairs Telugu Daily

15వేల మొక్కలు నాటాలని శిక్ష విధించిన ఢిల్లీ హైకోర్టు
2జీ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ మంత్రి ఏ రాజా, డీఎంకే ఎంపీ కనిమొళి సహా నిందితులందరినీ నిర్దోషులుగా తేలుస్తూ 2017 డిసెంబరు 21న దిల్లీలోని ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించిన విషయం తెలిసిందే. 
అయితే ఈ తీర్పును సవాల్‌ చేస్తూ 2018 మార్చిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దిల్లీ హైకోర్టులో అప్పీల్‌ దాఖలు చేసింది. దీంతో ఈ అప్పీల్‌పై తమ స్పందన తెలియజేయాలని నిర్దోషులుగా తేలిన వారిని కోర్టు సూచించింది.
అయితే వీరిలో ఇద్దరు వ్యక్తులు, మూడు కంపెనీలు ఇంతవరకూ తమ స్పందన తెలియజేయలేదు. 
ఇందుకు తమకు కొంత గడువు కావాలంటూ స్వాన్‌ టెలికాం ప్రయివేట్‌ లిమిటెడ్‌ ప్రమోటర్‌ షాహిద్‌ బల్వా, కుసేగావ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ డైరెక్టర్‌ రాజీవ్‌ అగర్వాల్‌, డైనమిక్‌ రియాల్టీ, డీబీ రియాల్టీ లిమిటెడ్‌, నిహార్‌ కన్‌స్ట్రక్షన్స్‌ ప్రయివేట్‌ లిమిటెడ్‌ గతంలో పలుసార్లు న్యాయస్థానాన్ని కోరారు. 
దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, ఒక్కొక్కరు 3000 మొక్కల చొప్పున 15వేల మొక్కలు నాటాలని శిక్ష విధించింది. ఫిబ్రవరి 15న అటవీ అధికారి ఎదుట హాజరై శిక్షను పూర్తిచేయాలని ఆదేశించింది. 
స్పందన తెలియజేసేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది. 
  • Delhi High Court Chief justice: Gita Mittal

views: 792

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams