Current Affairs Telugu Daily

సిర్పూర్‌ పేపరు మిల్లు పునః ప్రారంభం
2014లో మూతపడిన పరిశ్రమ తెలంగాణ ప్రభుత్వ చొరవతో తెరుచుకున్నది.ఫిబ్రవరి 7న రాత్రి 8.20 గంటలకు తిరిగి పేపర్ ఉత్పత్తి ప్రారంభమైంది. సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, వర్క్స్ అండ్ డైరెక్టర్ పీకే సూరి, ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, ఎస్పీఎం యూనిట్ హెడ్ మయాంక్ జిందాల్ ఉత్పత్తిని ప్రారంభించారు. 
Background:
నిజాం కాలంలో 1938లో ఎస్పీఎంను స్థాపించారు. 1950లో బిర్లాగ్రూప్ టేకోవర్ చేసింది. అప్పటినుంచి నిరాటంకంగా ఉత్పత్తి కొనసాగింది. కొత్త యంత్రాల కొనుగోలు పేరుతో యాజమాన్యం 2007-08లో మిల్లును ఐడీబీఐకి తాకట్టు పెట్టింది. అయితే నష్టాలు పెరిగిపోవడంతో 2014 సెప్టెంబర్ 27న షట్‌డౌన్ చేసింది. కంపెనీ మూసేనాటికి 3,200 మంది కార్మికులు పనిచేస్తున్నారు. వందలాది మంది పరోక్షంగా ఉపాధిని పొందేవారు. 2016 అక్టోబర్ 22న మిల్లును ఐడీబీఐ స్వాధీనం చేసుకున్నది. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక మిల్లును తెరిపిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారు. మిల్లును టేకోవర్ చేసే కంపెనీలకు రాయితీలు ఇస్తామని 2016 సెప్టెంబర్‌లో ప్రభుత్వం ప్రకటించింది

views: 780

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams