Current Affairs Telugu Daily

అగ్రిగోల్డ్‌ బాధితులకు శుభవార్త
అగ్రిగోల్డ్‌ బాధితులకు ఊరట కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రూ.10వేల లోపు డిపాజిట్లు ఉన్న బాధితులకు రాష్ట్ర ప్రభుత్వమే పరిహారం చెల్లించాలని నిర్ణయించింది.
ఈ డిపాజిట్లను తిరిగి చెల్లించేందుకు రూ.250 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. అగ్రిగోల్డ్ వద్ద రూ.10వేల లోపు డిపాజిట్‌ చేసిన బాధితులకు తొలుత చెల్లింపులు చేసేందుకుగాను ఈ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం పర్యవేక్షణలో జిల్లాస్థాయి కమిటీల ద్వారా చెల్లింపులు చేయాలని ప్రభుత్వం తన ఆదేశాల్లో పేర్కొంది.

views: 916



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams