Current Affairs Telugu Daily

2019 సంవత్సరంలో ఇస్రో (ISRO) ఖాతాలో రెండో విజయం నమోదు
గత నెలలో పీఎస్‌ఎల్‌వీ-సీ44 వాహక నౌక ద్వారా కలాం శాట్‌, మైక్రో శాట్‌-ఆర్‌ ఉపగ్రహాలను కక్ష్యలో ప్రవేశ పెట్టారు. తాజాగా  దక్షిణ అమెరికాలోని ఫ్రెంచ్‌ గయానాలో ఉన్న కౌరు అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి ఏరియన్‌ అంతరిక్ష సంస్థకు చెందిన ఏరియాన్‌ 5వీఏ వాహక నౌక ద్వారా మన దేశానికి చెందిన జీశాట్‌-31 సమాచార ఉపగ్రహాన్ని విజయవంతంగా రోదసిలోకి పంపారు. 
ఇదే వాహకనౌక నుంచి సౌదీఅరేబియాకు చెందిన హెల్లాస్‌సాట్‌-4 ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించారు. ప్రయోగం జరిగిన 42 నిమిషాలకు జీశాట్‌-31 నిర్ణీత కక్ష్యలోకి చేరుకుంది. 
అనంతరం ఇస్రోకు చెందిన కర్ణాటకలోని హసన్‌ కంట్రోల్‌ కేంద్రానికి అనుసంధానమైంది. ఈ ఉపగ్రహం ద్వారా కమ్యూనికేషన్‌ సేవలు మరింత చేరువ కానున్నాయి. 
గతంలో పంపిన ఇన్సాట్‌-4ఏ, ఇన్సాట్‌4సీఆర్‌ ఉపగ్రహాలకు ప్రత్యామ్నాయంగా దీనిని కక్ష్యలోకి ప్రవేశపెట్టారు.
ప్రత్యేకతలు:
* జీశాట్‌-31 ఉపగ్రహం బరువు 2,536 కిలోలు.ఇస్రోకు చెందిన 40వ కమ్యూనికేషన్‌ ఉపగ్రహం.
* 15 ఏళ్లపాటు సేవలందించనుంది.
* భూమికి సమాచారాన్ని అందించేందుకు కీలక వ్యవస్థ అయిన క్యూబ్యాండ్‌ను జీశాట్‌-31 ద్వారా మరింత శక్తిమంతంగా మార్చనుంది.
* వీశాట్‌ నెట్‌వర్కులు, టెలివిజన్‌ అప్‌లింకులు, డిజిటల్‌ ఉపగ్రహం, డీటీహెచ్‌ టెలివిజన్‌ సేవలు, చరవాణి అనుసంధాన అనుకూల సాంకేతికతతో రూపుదిద్దుకుంది.
* మారుమూల ఉండే దీవులకు కూడ డీటీహెచ్‌ సహా అనేక సర్వీసులు అందించేందుకు వీలవుతుంది.
 అరేబియా సముద్రం, బంగాళాఖాతం, హిందూ మహా సముద్రాలపై వైడ్‌ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్‌ను ఏర్పాటు చేయడం వల్ల ఇది సాధ్యమవుతుందని ఇస్రో వర్గాలు అంటున్నాయి.
* ఇప్పటికే భూస్థిర కక్ష్యలో ఉన్న ఇతర సమాచార ఉపగ్రహాలతో చేరి ఇది అదనపు సేవలను అందించనుంది
ప్రయోజనం:కమ్యూనికేషన్‌ సేవలు మరింత మెరుగు
 మారుమూల ఉండే దీవులకు సైతం అందుబాటులోకి రానున్న డీటీహెచ్‌ సహా పలు సర్వీసులు

views: 964

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams