Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ శాసనమండలి ఛైర్మన్‌గా ఎం.ఎ.షరీఫ్‌
ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఛైర్మన్‌గా తెదేపా సీనియర్‌ నాయకుడు, ప్రభుత్వ విప్‌ ఎం.ఎ.షరీఫ్‌ ఎన్నిక ఏకగ్రీవమైంది. శాసనమండలి ఛైర్మన్‌ పదవికి  నామినేషన్లు స్వీకరించగా ఎం.ఎ.షరీఫ్‌ ఒక్కరే నామినేషన్‌ దాఖలు చేశారు. 
నేడు షరీఫ్‌ మండలి ఛైర్మన్‌గా ఎన్నికైనట్టు అధికారికంగా ప్రకటించనున్నారు. శాసనమండలి ఛైర్మన్‌గా ఉన్న ఎన్‌.ఎండి.ఫరూక్‌ను ఇటీవల రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకోవడంతో ఆ పదవి ఖాళీగా ఉంది. 
మండలి ఛైర్మన్‌ పదవికి ఎన్నిక నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించడంతో నోటిఫికేషన్‌ జారీ చేశారు
నామినేషన్ల స్వీకరణ అంశాన్ని ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం మండలిలో ప్రకటించారు.

views: 926



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams