Current Affairs Telugu Daily

సంగీత్‌ నాటక్‌ అకాడమీ అవార్డులను ప్రదానం చేసిన రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ బుధవారం సంగీత్‌ నాటక్‌ అకాడమీ అవార్డులను ప్రదానం చేశారు. 
అయిదుకేటగిరీల్లో ఈ పురస్కారాలను పొందిన 42 మంది కళాకారులకు రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన వాటిని అందచేశారు. 
కూచిపూడి నర్తకి దీపికా రెడ్డి కూడా  ఈ పురస్కారం రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించిన వారిలో ఉన్నారు. 
అనంతరం దీపికారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..ఈ అవార్డును పొందడం ఎంతో సంతృప్తినిస్తోందన్నారు. 
గురువు వెంపటి చినసత్యంను ఆదర్శంగా తీసుకుని వందల మందికి నృత్యంలో శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందనలు తెలిపారు.
  • First awarded: 1952

views: 818

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams