Current Affairs Telugu Daily

యూఎస్‌ మార్కెట్‌ నుంచి ఒక ఔషధాన్ని  స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటున్న: డాక్టర్‌ రెడ్డీస్‌
డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబరేటరీస్‌, మరికొన్ని ఇతర కంపెనీలు యూఎస్‌లో ఔషధ ధరల వివాదంలో చిక్కుకున్నాయి. దాదాపు 30 జనరిక్‌ ఔషధాల ధరలకు సంబంధించిన బిడ్‌లను రిగ్గింగ్‌ చేయటానికి డాక్టర్‌ రెడ్డీస్‌, మరో 42 సంస్థలు ప్రయత్నించాయని యూఎస్‌లోని బీమా సంస్థ అయిన యునైటెడ్‌ హెల్త్‌కేర్‌ సర్వీసెస్‌ ఫిర్యాదు దాఖలు చేసింది. యూఎస్‌లోని షేర్‌మ్యాన్‌ చట్టంలోని 1వ సెక్షన్‌, మిన్నోసోటా తో పాటు మరో 29 రాష్ట్రాల విశ్వాసరాహిత్య చట్టాలను ఈ కంపెనీలు ఉల్లంఘించినట్లు అందులో ఆరోపించింది. 
వీటిపై చర్యలు తీసుకోవటమే కాకుండా నష్టపరిహారం, ఖర్చులు ఇప్పించాలని కోరింది. కానీ ఈ ఆరోపణలను డాక్టర్‌ రెడ్డీస్‌ తోసిపుచ్చింది. 
లెవిటిరాసెటమ్‌ ఇంజక్షన్‌ వెనక్కి...
యూఎస్‌ మార్కెట్‌ నుంచి ఒక ఔషధాన్ని డాక్టర్‌ రెడ్డీస్‌ స్వచ్ఛందంగా వెనక్కి తీసుకుంటోంది. లేబుల్‌ తప్పుగా ముద్రించటం దీనికి కారణంగా తెలుస్తోంది.
మూర్చ వ్యాధికి చికిత్సలో వినియోగించే లెవిటిరాసెటమ్‌ ఇంజక్షన్‌ను గత ఏడాది ఆగస్టు- సెప్టెంబరు నెలల్లో డాక్టర్‌ రెడ్డీస్‌ యూఎస్‌ మార్కెట్లో విడుదల చేసింది.
దీనిపై ముద్రించిన లేబుల్‌లో సమాచారం  తప్పుగా ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో ఔషధాన్ని వెనక్కి తీసుకునే ప్రక్రియను కంపెనీ చేపట్టింది.

views: 700



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams