Current Affairs Telugu Daily

ఎస్‌బీఐకి జెట్‌ ఎయిర్‌వేస్‌లో కనీసం 15 శాతం వాటా
జెట్‌ ఎయిర్‌వేస్‌ నుంచి రుణాలు వసూలు చేసుకునే మార్గం లేక, ఆ సంస్థలో వాటా తీసుకునేందుకు బ్యాంకులు సన్నద్ధమవుతున్నాయి. గుట్టలుగా పోగైన నిరర్థక ఆస్తులు (ఎన్‌పీఏ)తగ్గించుకునేందుకు విశ్వప్రయత్నం చేస్తుండగా, మళ్లీ జెట్‌ ఎయిర్‌ వేస్‌ రుణాలు ఎన్‌పీఏగా మారితే ఇబ్బంది కరమనే భావనతోనే బ్యాంకులు ఇందుకు అంగీకరించాయని సమాచారం. గతంలో మూతబడిన కింగ్‌ఫిషర్‌ ఎయిర్‌లైన్స్‌లోనూ బ్యాంకులు వాటా తీసుకున్నా, ఫలితం విధితమే.
దేశీయ విమానయాన రంగంలో ఆరోవంతు వాటా జెట్‌ ఎయిర్‌వేస్‌దే. స్టేట్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) నేతృత్వంలోని 26 బ్యాంకుల బృందానికి నరేశ్‌ గోయెల్‌ నేతృత్వంలోని జెట్‌ ఎయిర్‌వేస్‌ 1.52 బిలియన్‌ డాలర్ల (సుమారు రూ.10,800 కోట్ల) మేర చెల్లించాల్సి ఉంది. ఎస్‌బీఐకి అధికంగా, ఐసీఐసీఐ బ్యాంక్‌ (దుబాయి శాఖ), పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (హాంకాంగ్‌ శాఖ) కూడా పెద్దమొత్తంలో రుణాలిచ్చాయి.
జెట్‌ ఎయిర్‌వేస్‌ తదుపరి 90 రోజుల్లోపు కనుక, కనీసం రూ.1700 కోట్లయినా చెల్లించలేకపోతే, ఈ రుణం నిరర్థక ఆస్తిగా మారుతుంది. అందువల్లే వ్యూహాత్మక పెట్టుబడిదారు/రుణ పునర్‌వ్యవస్థీకరణ కోసం జెట్‌ ఎయిర్‌వేస్‌ ప్రయత్నిస్తోంది.
 రుణం పునరుద్ధరించాలంటే, జెట్‌ ఎయిర్‌వేస్‌లో 24 శాతం వాటా కలిగిన ఎతిహాద్‌ ఎయిర్‌వేస్‌ కనీసం రూ.3,500 కోట్లు పెట్టుబడి పెట్టాలని బ్యాంకర్లు కోరుతున్నారు
ఎస్‌బీఐకి జెట్‌ ఎయిర్‌వేస్‌లో కనీసం 15 శాతం వాటా లభిస్తుందని భావిస్తున్నారు. ఇతర బ్యాంకులకూ, వాటి రుణం మేర వాటా ఇస్తారు. 
అయితే బ్యాంకుల ప్రధాన వ్యాపారం రుణం ఇచ్చి, వడ్డీ పొందడం. అంతేకానీ వ్యాపార సంస్థల నిర్వహణ బాధ్యతలో లేవు. పైగా విమానయాన రంగం అంటేనే అకస్మాత్తు పరిణామాలకు వేదిక.  
కింగ్‌ఫిషర్‌ ఉదంతంలోనూ బ్యాంకులకు చేదు అనుభవాలే ఉన్న నేపథ్యంలో, జెట్‌ ఎయిర్‌వేస్‌లో వాటా పొందడం ఎంతవరకు మేలు చేస్తుందో చూడాల్సివుంది.
  • SBI Chairperson: Rajnish Kumar
  • Headquarters: Mumbai
  • Founded: 1 July 1955

views: 664

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams