Current Affairs Telugu Daily

టాటా ట్రస్ట్‌కు ఐటీ మినహాయింపు రద్దు
దేశీయ కార్పొరేట్‌ దిగ్గజం టాటా గ్రూప్‌నకు సంబంధించిన సర్‌ దోరబ్‌జీ టాటా ట్రస్ట్‌కు ఐటీ శాఖ మినహాయింపును రద్దు చేసింది. డిసెంబర్‌ చివర్లో తీసుకొన్న నిర్ణయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మినహాయింపులు పొందేందుకు పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించడంతో ఈ నిర్ణయం తీసుకొంది.  ట్రస్ట్‌లోని ట్రస్టీ సభ్యుడు ఆర్‌. వెంకటరమణన్‌కు పరిహారం చెల్లింపు విషయంలో ఉల్లఘనలు చోటు చేసుకొన్నట్లు గుర్తించింది. ఐటీ చట్టంలో పేర్కొన్న మొత్తాన్ని మించి పరిహారం ఇచ్చినట్లు తెలిసింది. ఐటీశాఖ ఆదేశాలను టాటాలు సవాలు చేసినట్లు సమాచారం.
టాటాలకు ఉన్న ట్రస్టుల్లో సర్‌ దోరబ్‌జీ టాటా ట్రస్ట్‌, రతన్‌టాటా ట్రస్ట్‌ అతిపెద్దవి. వీటి మొత్తం టాటా సన్స్‌లో దాదాపు 66 శాతం వాటా కలిగి ఉన్నాయి.
టాటా గ్రూప్‌ మొత్తానికి టాటా సన్స్‌ హోల్డింగ్‌ కంపెనీగా వ్యవహరిస్తోంది.
దోరబ్‌జీ టాటా ట్రస్ట్‌కు రతన్‌ టాటా ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు.
జరిగిన తీరు::
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్‌ 11 కిందకు ట్రస్ట్‌లు, ఇతర ధార్మిక సంస్థలకు సంబంధించిన మినహాయింపులను వస్తాయి. దీనికి సంబంధించి మినహాయింపులను పరిశీలించే అధికారం ఐటీశాఖ అధికారులకు ఉంటుంది. 
దోరబ్‌జీ టాటా ట్రస్ట్‌ బోర్డు సభ్యుడైన ఆర్‌. వెంకటరమణన్‌కు  2015-16 సంవత్సరానికి రూ.2.5 కోట్లు పరిహారంగా చెల్లించినట్లు గుర్తించింది. దీనిని అధికమొత్తంగా భావించింది.
దీనిపై ట్రస్ట్‌కు నోటీసులు జారీ చేసింది. అక్కడి నుంచి వచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేకపోవడంతో మినహాయింపును రద్దు చేసింది.

views: 674Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams