Current Affairs Telugu Daily

భారత్‌మాల పరిధిలో 12 ప్రాజెక్టుల అనుసంధానం
*ఇచ్చాపురం నుంచి తడ వరకు తీర ప్రాంతాల అభివృద్ధికి భారత్‌మాలలో జాతీయ రహదారికి 12 ప్రాజెక్టులను అనుసంధానిస్తున్నట్లు కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కె.జె.అల్ఫోన్స్‌ తెలిపారు.
*పరియోజనలో భాగంగా అభివృద్ధికి కేంద్రం వివిధ జాతీయ రహదారులతో రేవు పట్నాలను అనుసంధానిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగానే జాతీయ రహదారి-16 అనుసంధానానికి విశాఖపట్నం రేవు నుంచి 4.15 కి.మీ. రహదారి, రేవు పట్నం అనుసంధానతలో భాగంగా విశాఖ రేవు నుంచి 12 కి.మీ.ల మేర నాలుగు వరుసల రహదారి నిర్మాణం జరుగుతోందన్నారు. గాజువాక నుంచి గంగవరం రేవు వరకు 4.08 కి.మీ. మేర ఆరు వరుసలు, గంగవరం *రేవు నుంచి బీచ్‌ రోడ్డుకు నాలుగు వరుసలుగా 7.41 కి.మీ. రహదారి పనుల చేపట్టామన్నారు.
*అలాగే అచ్చంపేట జంక్షన్‌ నుంచి వాకలపుడి లైట్‌హౌస్‌ రోడ్డు వరకు నాలుగు వరుసలుగా 13.6 కి.మీ.లు, కాకినాడ రేవు నుంచి ఉప్పాడ బీచ్‌ రోడ్డుకు 43 కి.మీ.ల మేర నాలుగు వరుసల రహదారిని అనుసంధానించే పనులు సాగుతున్నట్లు తెలిపారు

views: 920

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams