Current Affairs Telugu Daily

శక్తికాంత దాస్‌ అధ్యక్షతన తొలిసారిగా ఆర్‌బీఐ ద్రవ్య విధాన కమిటీ భేటీ
ఆర్‌బీఐ గవర్నర్‌గా డిసెంబరులో బాధ్యతలు స్వీకరించిన శక్తికాంత దాస్‌ అధ్యక్షతన తొలిసారిగా ఈ సమావేశం జరుగుతోంది.ఈ సమావేశంలోనూ ఎంపీసీ వడ్డీ రేట్ల తగ్గింపు జోలికి పోకపోవచ్చని భావిస్తున్నారు. డిసెంబరులో జరిగిన సమావేశంలోనూ, ఎంపీసీ కీలకమైన వడ్డీ రేట్ల జోలికి పోలేదు. అయితే రిటైల్‌ ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే ఫిబ్రవరిలో జరిగే భేటీలో వడ్డీ రేట్ల తగ్గింపు విషయం పరిశీలిస్తామని ప్రకటించింది. డిసెంబరు 2018 నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠ స్థాయి 2.19 శాతానికి దిగొచ్చింది.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2018-19) ప్రభుత్వం నిరేశించిన లక్ష్యానికంటే ఇది చాలా తక్కువ. ఈ ఆర్థిక సంవత్సరంలో నాలుగు శాతానికి రెండు శాతం అటు ఇటుగా రిటైల్‌ ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయాలని ప్రభుత్వం ఆర్‌బీఐకి నిర్దేశించింది. రిటైల్‌ ద్రవ్యోల్బణం 18 నెలల కనిష్ఠ స్థాయికి దిగొచ్చినా ద్రవ్య లోటు భయాలు, పెరుగుతున్న ముడిచమురు ధరల నేపథ్యంలో ఈ నెల 7న ప్రకటించే ద్రవ్య, పరపతి సమీక్షలో ఆర్‌బీఐ కీలకమైన రెపో వడ్డీ రేటు తగ్గింపు జోలికి పోకపోవచ్చని మార్కెట్‌వర్గాల అంచనా.
  • ఆర్‌బీఐ గవర్నర్‌: శక్తికాంత దాస్‌
  • ప్రధాన కార్యాలయం: ముంబై 
  • స్థాపన: 1 April 1935

views: 1036

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams