Current Affairs Telugu Daily

‘ఆయుష్మాన్‌ భారత్‌’కు 6400 కోట్లు 
కేంద్ర ప్రభుత్వం రూ.61,398 కోట్లను ఆరోగ్యరంగానికి కేటాయించింది. అందులో రూ.6400 కోట్లను ప్రతిష్ఠాత్మక ‘ఆయుష్మాన్‌ భారత్‌ - ప్రధాన్‌మంత్రి జన్‌ఆరోగ్య యోజన’కు ప్రత్యేకించింది. 2018-19 కేటాయింపుల కంటే ఇవి 16 శాతం ఎక్కువ. 
* గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవల కోసం ఆయుష్మాన్‌ భారత్‌ కింద వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు రూ.250 కోట్లు 
* జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ కింద వెల్‌నెస్‌ సెంటర్ల ఏర్పాటుకు రూ.1,350.01 కోట్లు. 2022 కల్లా 1.5 లక్షల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల స్థాయి పెంపు. ఈ కేంద్రాల్లో రక్తపోటు, మధుమేహం, క్యాన్సర్‌, వృద్ధాప్య సంబంధ వ్యాధులకు చికిత్సలు 
* జాతీయ ఆరోగ్య మిషన్‌(ఎన్‌హచ్‌ఎం)కు రూ.31,745 కోట్లు. గత బడ్జెట్‌లో ఈ కేటాయింపు రూ.30,129 కోట్లు 
* ఎన్‌హెచ్‌ఎం ఆధ్వర్యంలో నడిచే రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజనకు నిధుల్లో భారీ కోత వేశారు. రూ.156 కోట్లు మాత్రమే కేటాయించారు. గతేడాది కేటాయింపు కంటే ఇది రూ.1844 కోట్లు తక్కువ కావడం గమనార్హం. 
* ఎయిడ్స్‌, ఎస్‌టీడీ నియంత్రణ కార్యక్రమాలకు గతేడాది కంటే రూ.400 కోట్లు ఎక్కువగా రూ.2500 కోట్లు కేటాయించారు. 
* జిల్లా ఆసుపత్రులు, రాష్ట్ర ప్రభుత్వ వైద్య కళాశాలల(పోస్టు గ్రాడ్యుయేట్‌ సీట్లు) ఆధునికీకరణ, వసతుల విస్తరణకు రూ.800 కోట్లు, నర్సింగ్‌ సేవల ఆధునికీకరణ, బలోపేతానికి రూ.64 కోట్లు, ఫార్మసీ కళాశాలల అభివృద్ధికి రూ.5 కోట్ల కేటాయింపు. 
* ప్రభుత్వ వైద్య కళాశాలలు(గ్రాడ్యుయేట్‌ సీట్లు), కేంద్ర ప్రభుత్వ అధీనంలోని ఆరోగ్య సంస్థల బలోపేతానికి రూ.1,361 కోట్లు 
* కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు రూ.2 వేల కోట్ల కేటాయింపు.

views: 822Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams