Current Affairs Telugu Daily

ఏపీ కేబినెట్‌ కీలక నిర్ణయాలు
*అగ్రిగోల్డ్‌ బాధితులకు పరిహారం చెల్లింపుపై ఏపీ మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. హైకోర్టులో రూ.250 కోట్లు డిపాజిట్‌ చేసి అగ్రిగోల్డ్‌ బాధితులకు చెల్లించాలని, ఆస్తుల వేలం తర్వాత ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించింది
*ప్రత్యేక హోదా, వంశధార నిర్వాసితులపై పెట్టిన కేసులు ఎత్తివేతకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సమైక్యాంధ్ర ఉద్యమం నాటి మిగిలిన కేసులు ఎత్తివేయాలని నిర్ణయించింది.
* కాపులకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించే ప్రతిపాదనకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
*పసుపు- కుంకుమ పథకం నిధుల పంపిణీకి, చుక్కల భూముల సమస్యల పరిష్కారంపై ముసాయిదా బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 
*‘భూధార్‌’ ప్రాజెక్టుకు చట్టబద్ధత కల్పించేందుకు ఉద్దేశించిన ముసాయిదా బిల్లుకు కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

views: 1092

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams