Current Affairs Telugu Daily

‘ఉత్తమ పార్లమెంటేరియన్‌’అవార్డు అందుకున్న ఎంపీ కవిత
తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా ఎంపీగా ఘనత వహించిన కల్వకుంట్ల కవిత మరో అరుదైన అవార్డును అందుకున్నారు. ప్రతిష్టాత్మక ఫేమ్ ఇండియా ఉత్తమ పార్లమెంటేరియన్‌ అవార్డును ఆమె సొంతం చేసుకున్నారు. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఫేమ్-ఇండియా శ్రేష్ఠ్ సంసద్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డుతో ఎంపీ కవితను సత్కరించారు.
ఫేమ్ ఇండియా-ఏషియా పోస్ట్ మేగజీన్… ఇటీవల నిర్వహించిన శ్రేష్ట్-సంసద్ సర్వేలో ఎంపీ కవిత ఈ అవార్డుకు ఎంపికయ్యారు. పార్లమెంటులో ప్రజా సమస్యలపై లేవనెత్తిన ప్రశ్నలు, చర్చల ద్వారా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం, ప్రజల్లో ఆదరణ, ప్రజాసమస్యల పరిష్కారంలో కార్యదక్షత, పార్లమెంటు సమావేశాలకు హాజరు  వంటి 10 అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించారు. ఇందులో మొత్తం 545 మంది ఎంపీలకు గాను 25 మందిని ఉత్తమ పార్లమెంటేరియన్‌లుగా ఎంపిక చేశారు. ఎంపీ కవిత ఉద్యమ ప్రస్థానాన్ని, ప్రజా సమస్యల పరిష్కారంలో ఆమె అంకిత భావాన్ని ఫేమ్-ఇండియా ప్రశంసించింది. ఎంపీ కవితకు ఉత్తమ పార్లమెంటేరియన్‌గా ఎంపిక చేయడంతో పాటు.ఆమెను తెలంగాణ ధీరవనితగా, అత్యంత ప్రతిభాశాలిగా ఫేమ్-ఇండియా ప్రశంసించింది.

views: 883



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams