త్వరలో బయో సిమిలర్‌ మందులు
చౌక ధరలకే మందులు అందించాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతం బయో సిమిలర్‌ ఔషధాల తయారీపై దృష్టిసారించింది. జనరిక్‌ మందులు మాదిరిగానే వీటినీ తయారు చేస్తారు. మధుమేహం, కీళ్ల నొప్పు, క్యాన్సర్‌ వ్యాధు నివారణకు ఈ మందు తయారు చేయించాలని కేంద్ర బయోటెక్నాలజీ విభాగం భావిస్తోంది. బయో సిమిలర్‌ జౌషధాలు అచ్చం అసలు మందుల్లాగానే ఉంటాయి. ప్రపంచ మార్కెట్‌లో భారత ఔషధాల వాటా ప్రస్తుతం 3% కాగా, 2022 నాటికి దాన్ని 5%కి పెంచాలని ప్రభుత్వం లవాక్సిన్లు తయారు చేయడానికి బయోఫార్మా మిషన్‌ను ఏర్పాటు చేసింది. డెంగీ నివారణ వాక్సిన్‌, న్యూమోకోకల్‌, హ్యూమన్‌ పాపిలోమావైరస్‌ వ్యాక్సిన్లను తక్కువ ధరకే అందించడానికి కార్యాచరణ రూపొందించింది.
views: 828

Current Affairs Telugu
e-Magazine
July-2018
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams