Current Affairs Telugu Daily

రూ.10 కోట్లు డిపాజిట్‌ చేసి విదేశాలకు వెళ్లండి : సుప్రీం
సుప్రీంకోర్టు రిజిస్ట్రీలో రూ.10 కోట్లు డిపాజిట్‌ చేసి విదేశాలకు వెళ్లవచ్చని చిదంబరం  కార్తీకి  సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.
దర్యాప్తునకు సహకరించాలని, చట్టంతో ఆడుకోవద్దని హెచ్చరించింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా, ఎయిర్‌సెల్‌ మ్యాక్సిస్‌ కేసుల్లో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ‘‘ఫిబ్రవరి 10 నుంచి 26 మధ్యన మీరు ఎక్కడికైనా వెళ్లండి. 
అయితే దర్యాప్తునకు సహకరించండి. మీరు సహకరించడం లేదు.’’ అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి ఆధ్వర్యంలోని ధర్మాసనం వ్యాఖ్యానించింది. 
ఆయనను మార్చి 5,6,7,12 తేదీల్లో విచారించనున్నట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ తెలిపింది.
ఫ్రాన్స్‌, జర్మనీ, స్పెయిన్‌, బ్రిటన్‌లో టోటుస్‌ టెన్నీస్‌ లిమిటెడ్‌ అనే సంస్థ నిర్వహించే పోటీలకు హాజరయ్యేందుకు ఫిబ్రవరి 10 నుంచి 26 వరకు, మార్చి 23 నుంచి 31 వరకు అనుమతి ఇవ్వాలని కార్తీ కోరారు.

views: 700

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams