Current Affairs Telugu Daily

సమాచార దుర్వినియోగ వివాదంలో ఫేస్ బుక్ 
సమాచార దుర్వినియోగం విషయంలో ఇప్పటికీ సామాజిక మాధ్యమ దిగ్గజం ఫేస్‌బుక్ చుట్టూ అనేక వివాదాలు చుట్టుముడుతూనే ఉన్నాయి. 
ఇప్పుడు మీడియాలో దానికి సంబంధించి మరో వివాదం బయటకు వచ్చింది. టీనేజర్లకు రహస్యంగా కొంతమొత్తం చెల్లించి, వారి సమాచారాన్ని పొందుతుందని దాని సారాంశం.
సమాచారం కోసం నెలవారీగా 20 డాలర్లు చెల్లించి ‘ఫేస్‌బుక్ రిసెర్చ్‌’ వర్చువల్ ప్రైవేటు నెట్‌వర్క్‌(వీపీఎన్‌)ను ఇన్‌స్టాల్ చేసుకొనేలా ప్రోత్సహిస్తోందని ఆ నివేదిక ద్వారా వెల్లడవుతోంది.
 ఈ రీసెర్చ్‌ ప్రొగ్రామ్ ద్వారా వారి యూసేజ్‌ హాబిట్స్‌ను తెలుసుకోవాలనుకుంటుందని, అలాగే ఆ ప్రొగ్రామ్ నిలిపివేసే ఉద్దేశం సంస్థకు లేదని పేర్కొంది.
 ఇది గతంలో ఫేస్‌బుక్‌కు చెందిన ఒనావో ప్రొటెక్ట్‌ యాప్‌ను పోలిఉంది. దాన్ని గత సంవత్సరం జూన్‌లో యాపిల్ సంస్థ నిషేధించి, తరవాత తొలగించింది.
2016 నుంచి వేరే మార్గాల ద్వారా ఫేస్‌బుక్‌ వినియోగదారుల చెంతకు చేరుతుంది. 
ముఖ్యంగా 13 నుంచి 35 సంవత్సరాల వయసు వారిని లక్ష్యంగా చేసుకొని వారికి నెలకు 20 డాలర్లతో పాటు రిఫరల్ ఫీజును చెల్లిస్తోంది.
 ఫేస్‌బుకు రిసెర్చ్‌ యాప్‌ను ఐఓఎస్‌, ఆండ్రాయిడ్‌లో ఇన్‌స్టాల్ చేసుకొని వినియోగదారులు తమ సమాచారాన్ని అమ్ముకుంటున్నారని ఆ నివేదిక వివరించింది. 
అలాగే అమెజాన్‌ ఆర్డర్‌ హిస్టరీ పేజ్‌ను కూడా స్క్రీన్‌షాట్ తీసి పంపించాలని ఫేస్‌బుక్‌ కోరుతుంది. బీటా సర్వీసులైన అప్లాజ్‌, బీటాబౌండ్, యూటెస్ట్‌ వంటి వాటి ద్వారా ఈ ప్రొగ్రామ్‌ను నిర్వహిస్తోంది.
CEO: Mark Zuckerberg
Headquarters: Menlo Park, California, United States
CFO: David Wehner

views: 748



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams