Current Affairs Telugu Daily

నీటిపై తేలియాడే టర్బైన్లను పరీక్షిస్తున్న: ఐఐటీ-రూర్కీ
నదుల్లో, కాలువల్లో తేలియాడుతూ వాటిలోని నీటి ప్రవాహం ఆధారంగా విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పరికరాన్ని ఐఐటీ-రూర్కీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేస్తున్నారు.
ప్రస్తుతం దీని నమూనా పరికరంపై పరీక్షలు సాగుతున్నాయి. రూర్కీలోని ఎగువ గంగా కాలువలో దీన్ని బిగించారు. దీని రూపకల్పన కోసం రెండేళ్లపాటు పరిశోధనలు జరిపినట్లు పరిశోధకులు తెలిపారు. 
కాలువకు ఇరువైపులా ఒడ్డులపై సిమెంట్‌ బ్లాకులు నిర్మించి నీటిపై తేలియాడేలా టర్బెన్‌లను బిగించినట్లు వివరించారు. ‘‘సంప్రదాయ విధానంలో టర్బైన్‌లు తిరిగేందుకు నీరు ఎత్తుపై నుంచి పడాలి. 
అందుకోసం పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టాలి. మేం మాత్రం నదీ ప్రవాహాన్నే ఇందుకు వినియోగించుకుంటున్నాం. పవన విద్యుత్‌ కన్నా ఇది చాలా మెరుగైనది’’ అని ప్రముఖులు తెలిపారు.
రూర్కీ : ‎Uttarakhand
Uttarakhand Governor: Baby Rani Maurya
Chief minister: Trivendra Singh Rawat

views: 871

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams