Current Affairs Telugu Daily

వివాదం లేని అయోధ్య భూమిని తిరిగిస్తామని సుప్రీంకోర్టులో కేంద్రం పిటిషన్‌
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రభుత్వం గతంలో వివాదంలో చిక్కిన భూమి కాకుండా అదనంగా సేకరించిన, ఏ వివాదాలూ లేని 67.39 ఎకరాల భూమిని తిరిగి వాస్తవ యజమానులకు అప్పగించేందుకు అనుమతివ్వాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
  • ఈ భూమిలో 42 ఎకరాలు రామాలయ నిర్మాణం కోసం పోరాడుతున్న రామ జన్మభూమి న్యాస్‌ అనే హిందూ సంస్థకు చెందినవే. 
  • వివాదాస్పద స్థలం చుట్టూ ఉన్న మొత్తం 67.39 ఎకరాల్లోనూ ఎలాంటి నిర్మాణాలూ చేపట్టకుండా సుప్రీంకోర్టు 2003లో స్టే విధించింది. వివాదం పూర్తిగా పరిష్కారమయ్యే వరకు ఈ స్టే అమలులో ఉంటుందని నాడు కోర్టు తీర్పు చెప్పింది.
  • ఈ తీర్పును సవరించాలని, వివాదాలు లేని భూమిని అసలైన యజమానులకు తిరిగి అప్పగించేందుకు అనుమతించాలని తాజాగా కేంద్రం తన పిటిషన్‌లో సుప్రీంకోర్టును కోరింది.
  • నాడు మసీదు ఉన్న 0.313 ఎకరాల స్థలం మాత్రమే వివాదంలో ఉందని, ఆ మసీదు 2.77 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఆవరణలో ఉండేదని పిటిషన్‌లో కేంద్రం పేర్కొంది.
  • కేంద్రం 67కు పైగా ఎకరాల భూమిని సేకరించడాన్ని సవాలు చేస్తూ డాక్టర్‌ ఇస్మాయిల్‌ ఫారూఖీ వేసిన పిటిషన్‌పై ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు ధర్మాసనం 1994లో తీర్పు ఇచ్చింది.
  • అయోధ్య సివిల్‌ దావాపై అలహాబాద్‌ హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత వివాదాస్పదం కాని భూమిని దాని యజమానులకు అప్పగించే విషయం ప్రభుత్వం పరిశీలించవచ్చని ఈ ధర్మాసనం తన తీర్పులో సూచించింది.
  • ఈ విషయాన్ని కేంద్రం తన పిటిషన్‌లో సుప్రీంకోర్టుకు గుర్తు చేసింది. రామ మందిరం నిర్మాణం చేపట్టి, ఈ కార్యక్రమం పర్యవేక్షించడానికి ఏర్పాటైన రామ జన్మభూమి న్యాస్‌కు వివాదాస్పదం కాని భూమిని ఇవ్వాలనుకుంటున్నట్టు కేంద్రం తన తాజా పిటిషన్‌లో కోర్టుకు తెలిపింది.
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - రంజన్‌ గొగోయ్‌

views: 712Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams