Current Affairs Telugu Daily

జాతీయ రహదారులకు నంబర్లు కేటాయించాలని రాష్ట్రాల విజ్ఞప్తి
జాతీయ రహదారులుగా ప్రకటించిన అయిదు ప్రధాన రహదారులకు నంబర్లు కేటాయిస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేయాలని జాతీయ రహదారుల విభాగం రాష్ట్ర ముఖ్య ఇంజినీర్‌ గణపతిరెడ్డి, ర.భ.శాఖ కమిషనర్‌ సునీల్‌ శర్మలు జాతీయ రహదారులు, ఉపరితల రవాణా శాఖాధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇటీవల వారు దిల్లీలో NHAI అధికారులతో సమావేశమయ్యారు.
మెదక్‌-రుద్రూర్‌-బాసర-భైంసా, బోధన్‌-భైౖంసా, చౌటుప్పల్‌-షాద్‌నగర్‌-కంది,
మెదక్‌-సిద్దిపేట-హుస్నాబాద్‌-ఎల్కతుర్తి, హైదరాబాద్‌-తొర్రూర్‌-మహబూబాబాద్‌- కొత్తగూడెం రహదారులకు వెంటనే నంబర్లు కేటాయించాలని కోరారు.
హైదరాబాద్‌ ప్రాంతీయ వలయ రహదారి అంశాన్ని అధికారులు ప్రస్తావించగా త్వరలో నిర్వహించే సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని కేంద్ర అధికారులు తెలిపారు.

views: 701

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams