Current Affairs Telugu Daily

ఆర్టికల్‌ 31బీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలి
రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 31బీ రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించాలంటూ పలువురు రైతులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్టికల్‌ 31బీ రైతులకు శాపంగా మారిందని, అది చెల్లదని ఆదేశాలు ఇవ్వాలని కోరారు.
రైతు ఆత్మహత్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న కేసులో కిసాన్‌పుత్ర ఆందోళన్‌కు చెందిన నరేశ్‌ రామయ్య చేగూరి(తెలంగాణ), మకరంద్‌ మల్లికార్జున్‌(మహారాష్ట్ర), బసగౌడ పాటిల్‌ (కర్ణాటక)లు ఇంప్లీడ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. 
మానవ హక్కుల ఉల్లంఘన జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని ఆర్టికల్‌ 32 చెబుతుంటే, ఆర్టికల్‌ 31బీ మాత్రం.. తొమ్మిదో షెడ్యూలులో పొందుపరిచిన అంశాలపై కోర్టు ముందు సవాల్‌(ఛాలెంజ్‌) చేయడానికి వీల్లేదని చెబుతోందని వ్యాజ్యంలో పేర్కొన్నారు.
ఇది పరస్పర విరుద్ధంగా ఉందన్నారు. ఆర్టికల్‌ 31బీ, ఆర్టికల్‌ 32లను కలిపి పరిగణిస్తే రాజ్యాంగం అర్థం చేసుకోవడంలో సంక్లిష్ఠత ఏర్పడుతోందని తెలిపారు.

views: 658

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams