Current Affairs Telugu Daily

కృష్ణారావుకు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డు
సీనియర్‌ జర్నలిస్ట్‌, ఆంధ్రజ్యోతి అసోసియేట్‌ ఎడిటర్‌, కవి అప్పరసు కృష్ణారావు కేంద్ర సాహిత్య అకాడమీ అనువాద అవార్డుకు ఎంపికయ్యారు.
  • జమ్ము కశ్మీర్‌కు చెందిన ప్రముఖ డోగ్రీ కవయిత్రి పద్మశ్రీ పద్మా సచ్‌దేవ్‌ రాసిన కవితను ‘‘గుప్పెడు సూర్యుడు.. మరికొన్ని కవితలు’’ పేరిట తెలుగులోకి అనువదించినందుకు ఆయన ఈ పురస్కారానికి ఎంపికయ్యారు.
  • దేశ విభజన సమయంలో తండ్రిని పోగొట్టుకున్న కవయిత్రి తాను ఎదుర్కొన్న మానసిక వేదన, భారతీయ స్త్రీ ఎదుర్కొనే సామాజిక ఇబ్బందులు, సుఖదుఃఖాలను తన కవితల్లో చిత్రీకరించగా.. కృష్ణారావు వాటిని తెలుగులోకి అద్భుతంగా అనువదించారని ప్రశంసాపత్రంలో కొనియాడారు.
  • డోగ్రీ భాషలోని ఈ కవితలను కేంద్ర మాజీ మంత్రి కరణ్‌సింగ్‌ ఇంగ్లిషులోకి తర్జుమా చేయగా.. కృష్ణారావు తెలుగులోకి అనువదించారు. కృష్ణారావుకు పురస్కారం కింద రూ.50 వేల నగదు, ప్రశంసపత్రం అందజేయనున్నారు.
  • కృష్ణారావు 1962లో మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొండ మండలం వింజమూరు గ్రామంలో జన్మించారు. 
కేంద్ర సాహిత్య అకాడమి అధ్యక్షుడు - చంద్రశేఖర్‌ కంబార్‌

views: 908

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams