Current Affairs Telugu Daily

WTA ర్యాంకింగ్స్‌లో నయోమి ఒసాకాకు ప్రథమ స్థానం
మహిళ టెన్నిస్‌ సంఘం(WTA) ర్యాంకింగ్స్‌లో జపాన్‌ ప్లేయర్‌ నయోమి ఒసాకా ప్రథమ స్థానంలో నిలిచింది.
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళ సింగిల్స్‌ టైటిల్స్‌ గెల్చుకోవడంతో ఒసాకా మూడు స్థానాలు ఎగబాకి టాప్‌ ర్యాంక్‌కు చేరుకుంది. పురుషుల సింగిల్స్‌లోగాని, మహిళ సింగిల్స్‌లోగాని ఆసియా నుంచి నంబర్‌వన్‌ స్థానాన్ని అందుకున్న తొలి ప్లేయర్‌గా ఒసాకా గుర్తింపు పొందింది.
  • 1975లో అధికారికంగా కంప్యూటర్‌ ర్యాంకింగ్స్‌ ప్రవేశపెట్టాక నంబర్‌వన్‌ స్థానానికి చేరిన 26వ మహిళా క్రీడాకారిణిగా ఒసాకా నిలిచింది. 
  • అసోసియేషన్‌ ఆఫ్‌ టెన్నిస్‌ ప్రొఫెషనల్స్‌ (ATP) పురుషుల ర్యాంకింగ్స్‌లో నొవాక్‌ జొకోవిచ్‌ 10,955 పాయింట్లతో టాప్‌ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.
  • ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌లో ప్రిక్వార్టర్‌ ఫైనల్లో నిష్క్రమించిన స్విట్జర్లాండ్‌ దిగ్గజం రోజర్‌ ఫెడరర్‌ మూడు స్థానాలు దిగజారి 6వ స్థానానికి చేరాడు. రాఫెల్‌ నాదల్‌(స్పెయిన్‌) 2వ, అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌(జర్మనీ) 3వ స్థానంలో ఉన్నారు
WTA-Women's Tennis Association
ATP-Association of Tennis Professionals

views: 782

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams