Current Affairs Telugu Daily

రోవర్‌ అపార్చునిటీ గతించినట్లు నాసా అంచనా
అంగారక గ్రహానికి సంబంధించిన ఫొటోలు, సమాచారాన్ని మనకు పంపిస్తూ వచ్చిన రోవర్‌ అపార్చునిటీ గతించినట్లు భావిస్తున్నామని నాసా ప్రకటించింది.
  • ఇది గత 15 ఏళ్లుగా సేవలందిస్తోంది. అపార్చునిటీ ఉన్న పర్‌సెవరెన్స్‌ లోయ దక్షిణ భాగంలో 7 నెలల క్రితం సంభవించిన భారీ తుపానులో అది దెబ్బతిని ఉంటుందని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు.
  • ఈ తుపాను నుంచి వెలువడిన ధూళి, దుమ్ము ఆ ప్రాంతాన్ని కప్పేసిందని, అప్పటి నుంచి దాని సౌర పలకలు సౌరశక్తిని గ్రహించడం కష్టంగా మారడంతో బ్యాటరీ చార్జింగ్‌ ఆగిపోయిందని వెల్లడించారు.
  • క్రమంగా తుపాను ఉధృతి తగ్గిన తరువాత రోవర్‌తో సంబంధాల పునరుద్ధరణకు మిషన్‌ బృందం చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.
  • అపార్చునిటీ నుంచి చివరిసారిగా 2018 జూన్‌ 10న భూమికి సంకేతాలు చేరాయి. ఆ తరువాత రోవర్‌కు సుమారు 600 కమాండ్లు పంపామని నాసా తెలిపింది. డీప్‌ స్పేస్‌ నెట్‌వర్క్‌(DSN) రేడియో సైన్స్‌ సాయంతో వేర్వేరు పౌనఃపున్యాలు, పోరైజేషన్‌లో అపార్చునిటీ గురించి పరిశోధకులు అన్వేషణ కొనసాగిస్తూనే ఉన్నారు.
  • ఇక చివరి ప్రయత్నంగా రాబోయే వారాల్లో మరిన్ని కమాండ్‌లు పంపాలని కాలిఫోర్నియాలోని జెట్‌ ప్రొప్షన్‌ లేబొరేటరీ పరిశోధకులు సమాయత్తమవుతున్నారు. అపార్చునిటీతో తిరిగి సంబంధాలు పొందేందుకు అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక మార్గాల్ని పరిశీలిస్తామని వారు చెప్పారు.
  • గోల్ఫ్‌ కారు పరిమాణంలో, ఆరు చక్రాలతో కూడిన అపార్చునిటీ 2004, జనవరి 24న అంగారకుడి ఉపరిలతంపై కాలుమోపింది.
  • దీనితో పాటు స్పిరిట్‌ అనే మరో రోవర్‌ను కూడా పంపారు. అరుణ గ్రహం నుంచి భూమికి సంకేతాలు పంపిన తొలి రోవర్‌గా అపార్చునిటీ గుర్తింపు పొందింది. అంగారకుడిపై 1,006 మీటర్లు ప్రయాణించి, 90 రోజు సేవందించేలా దీన్ని రూపొందించారు.
  • కానీ గత ఏడాది ఫిబ్రవరి నాటికే 45 కిలోమీటర్లు ప్రయాణించి 5000వ రోజును పూర్తి చేసుకుంది. సహచర స్పిరిట్‌ మిషన్‌ 2011లోనే ముగిసింది. 
DSN-Deep Space Network
NASA-National Aeronautics and Space Administration
........
NASA 
ఏర్పాటు : 1958 జులై 29
ప్రధాన కార్యాయం : వాషింగ్టన్‌ డి.సి.

views: 761

6 Months Telugu Current Affairs Practice Bits
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams