Current Affairs Telugu Daily

జంతు సంక్షేమ బోర్డు అధ్యక్షుడు ఎస్‌.పి.గుప్తా తొలగింపు
భారత జంతు సంక్షేమ బోర్డు(AWBI) అధ్యక్ష పదవి నుంచి RSSకు చెందిన వ్యక్తిగా పేరొందిన రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆఫీసర్‌ ఎస్‌.పి.గుప్తాను తొలగించారు.
  • 2017 డిసెంబర్‌లో గుప్తాకు ఈ పదవి దక్కడంలో ఆర్‌ఎస్‌ఎస్‌ కీలకంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. బోర్డులో గుప్తా దుష్ప్రవర్తనకు పాల్పడుతున్నట్లు మేనకాగాంధీ 2018 ద్వితీయార్థం నుంచి పర్యావరణ మంత్రిత్వశాఖకు తరచూ లేఖలు రాస్తూ వచ్చారు.
  • సినిమాలు, తదితర కార్యక్రమాల్లో జంతువును ఉపయోగించడంపై మదింపు చేపట్టే 9 మంది సభ్యులు ఉపకమిటీకి సంబంధించి అవకతవకలు జరిగినట్లు ఆరోపించారు. చట్ట విరుద్ధంగా కోతులను టీవీ సీరియళ్లలో ఉపయోగించుకునేందుకు గుప్తా ఉదారంగా అనుమతులు ఇచ్చినట్లు ఆరోపణలు గుప్పించారు.
  • సర్కస్‌లో జంతువులను ప్రదర్శించడాన్ని నిషేధిస్తూ 2018 నవంబర్‌లో పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీ చేయగా, సదరు ఆదేశాలను ఉపసంహరించుకోవాలంటూ గుప్తా లేఖ రాశారు. 
AWBI-Animal Welfare Board of India
RSS-Rashtriya Swayamsevak Sangh
............
భారత జంతు సంక్షేమ బోర్డు
ప్రధాన కార్యాలయం : వల్లభ్‌నగర్‌ (హర్యానా)

views: 665

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams