Current Affairs Telugu Daily

భారత్‌ మూలాలున్న పారిశ్రామికవేత్తపై అమెరికాలో విచారణ
వైద్యులను ప్రలోభ పెట్టారనే ఆరోపణపై భారత్‌లో మూలాలున్న సుసంపన్న పారిశ్రామికవేత్త జాన్‌కపూర్‌(75)పై అమెరికాలో విచారణ జరగనుంది.
  • మత్తు కలిగించే కొన్ని ఔషధాలను తీసుకోవడం అలవాటుగా మారిపోవడానికి, ఆ తర్వాత మరణాలు సంభవించడానికి ఆయన కారణమని అభియోగాలు నమోదయ్యాయి.
  • దీనిపై బోస్టన్‌లో విచారణ మొదవుతుంది. ఆరోపణలు రుజువైతే ఆయనకు చెందిన ఇన్‌సిస్‌ థెరపిటిక్స్‌ ఔషధ కంపెనీకి భారీ జరిమానా పడే అవకాశం ఉంది. దీంతోపాటు 25 ఏళ్ల కారాగార శిక్ష పడొచ్చు.
  • భారత్‌లో ఒకప్పుడు సాదాసీదా జీవితం గడిపిన కపూర్‌ అమెరికా వచ్చాక కోటీశ్వరుడయ్యారు. ఫార్మా కంపెనీకి సీఈవోగా ఎదిగారు.
  • కేవలం క్యాన్సర్‌ రోగులకు వాడాల్సిన అత్యంత మత్తుకారక నొప్పి నివారణ మందుల్ని వైద్యులు ఎక్కువమందికి రాసేలా ఆయన ప్రలోభ పెట్టారనే ఆరోపణలు వచ్చాయి.
  • వైద్యులు బంధువులకు ఉద్యోగాలు ఎర వేయడం, విలాసవంతమైన హోటళ్లలో వైద్యులకు ఆతిథ్యమివ్వడం వంటివి ఆయన చేసేవారని ఫిర్యాదు పేర్కొంటున్నాయి.

views: 661

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams