యూఎస్-బంగ్లా విమాన ప్రమాదంపై దర్యాప్తు కమిటీ నివేదిక వెల్లడి
పైలట్ ధూమపానం, మానసిక ఒత్తిడికి లోనవడం వంటి కారణాలే యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ విమానం దుర్ఘటనకు కారణమని తేలింది.
2018 మార్చిలో జరిగిన బొంబార్డియెర్ యూబీజీ-211 విమానం దుర్ఘటనకు సంబంధించి కాక్‌పిట్ వాయిస్ రికార్డర్(సీవీఆర్) ద్వారా కారణాలను గుర్తించారు.
దుర్ఘటనపై దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన కమిటీ సీవీఆర్‌ను పరిశీలించి విమానం ప్రయాణిస్తుండగానే పైలట్ ధూమపానం చేసినట్లు తేల్చిందని ఓ వార్తాసంస్థ వెల్లడించింది.
పైలట్ అప్పటి పరిస్థితులపై అవగాహన, నియంత్రణ కోల్పోవడం కారణంగానే ప్రమాదం జరిగినట్లు కమిటీ స్పష్టం చేసింది. దుర్ఘటనకు పైలట్ మానసిక ఒత్తిడి కూడా కారణమని కమిటీ నివేదిక వెల్లడించింది. ఓ మహిళా సహోద్యోగితో విభేదాల కారణంగా పైలట్ ఒత్తిడికి లోనైనట్లు వెల్లడించింది.
2018 మార్చి 12న ఢాకా నుంచి నేపాల్ రాజధాని ఖాట్మండ్ వెళ్తున్న యూఎస్-బంగ్లా ఎయిర్‌లైన్స్ త్రిభువన్ అంతర్జాతీయ విమానశ్రయంలో దిగిన వెంటనే రన్‌వే పైనుంచి కిందికి జారి నిప్పంటుకోవడం ద్వారా జరిగిన ప్రమాదంలో 51 మంది ప్రయాణికులు దుర్మరణం చెందారు.
దుర్ఘటనపై దర్యాప్తు చేపట్టిన కమిటీ తన నివేదికను నేపాల్ ప్రభుత్వానికి సమర్పించింది. ప్రమాదం సమయంలో విమానం సిబ్బందికి, ఎయిర్‌ట్రాఫిక్ కంట్రోర్ మధ్య కమ్యూనికేషన్ విషయంలో గందరగోళం తలెత్తినట్లు గుర్తించారు.
డిప్రెషన్ బాధితుడైన సదరు కెప్టెన్ 1993లో బంగ్లాదేశ్ వైమానిక దళం నుంచి బయటికి వచ్చారు. తర్వాత పౌర విమానాలు నడిపేందుకు అర్హత సంపాదించారు.
........
బంగ్లాదేశ్
రాజధాని : ఢాకా
Capital : Dhaka
అధ్యక్షుడు : అబ్దుల్ హమిద్
President : Abdul Hamid
Prime Minister : Sheikh Hasina
ప్రధానమంత్రి : షేక్ హసీనా
కరెన్సీ : టాకా
Currency: Taka
views: 669