Current Affairs Telugu Daily

ఈ-నామ్‌లో కర్నూలు మార్కెట్‌తో గద్వాల మార్కెట్‌ అనుసంధానం
తెలంగాణ రైతులు పండిస్తున్న పంటలను జాతీయ విపణిలోకి ఆన్‌లైన్‌ ద్వారా తీసుకెళ్లి గిట్టుబాటు ధరలు కల్పించేందుకు మార్కెటింగ్‌ శాఖ చర్యలు ప్రారంభించింది.
  • ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌(ఈ-నామ్‌) పథకం కింద ఇతర రాష్ట్రాల మార్కెట్లను తెలంగాణ వ్యవసాయ మార్కెట్లతో అనుసంధానం చేయడానికి ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా ప్రయోగాత్మకంగా గద్వాల మార్కెట్‌ను ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు మార్కెట్‌తో కలిపింది.
  • ఈ 2 మార్కెట్లలో లైసెన్సున్న వ్యాపారులు ఎక్కడైనా పంటలు కొనే అవకాశం కల్పించింది. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నందున అప్పుడున్న అనుభవాలతో ఈ-నామ్‌లో మొదట ఆంధ్రప్రదేశ్‌తో అనుసంధానం ప్రారంభించింది.
  • మలిదశలో తమిళనాడు, కేరళ, కర్ణాటక వంటి దక్షిణాది రాష్ట్రాల మార్కెట్లన్నింటినీ కలుపుతారు. కర్నూలు వ్యాపారి గద్వాల మార్కెట్‌లో వేరుసెనగలు కొంటే.. వెంటనే సదరు వ్యాపారి కర్నూలు మార్కెట్‌ సిబ్బందికి సమాచారమిచ్చి ఆన్‌లైన్‌లో సొమ్ము వేయాలి.
  • గద్వాల నుంచి సదరు వ్యాపారికి పంటను రవాణా చేసేందుకు ఇక్కడి మార్కెట్‌ సిబ్బందీ సహకరించాలి. 
అంతర్రాష్ట్ర మార్కెట్లలో కొనుగోళ్లు జరిగేటప్పుడు ఈ రుసుంను ఆన్‌లైన్‌లోనే చెల్లిస్తే అదే విధానంలో ఆన్‌లైన్‌ పర్మిట్‌నూ జారీ చేసేందుకు తెలంగాణ మార్కెటింగ్‌ శాఖ ఈ-సర్వీసు వ్యవస్థను ఏర్పాటు చేసింది.
..........
ఇనామ్‌  : 
ప్రారంభం    :     2016 ఏప్రిల్‌ 14
ఉద్దేశం     :     జాతీయ వ్యవసాయ మార్కెట్‌ పోర్టల్‌
eNAM-National Agriculture Market

views: 748

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams