Current Affairs Telugu Daily

హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్‌ మిషన్‌ పురస్కారం
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌కు స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఉన్నత పురస్కారం లభించింది.
  • హైదరాబాద్‌ను బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆయా వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు గాను.. ODF(ఓపెన్‌ డిఫికేషన్‌ ఫ్రీ)గుర్తింపును జారీ చేస్తూ స్వచ్ఛభారత్‌ మిషన్‌ 2019 జనవరి 28న ఉత్తర్వులు జారీ చేసింది.
  • దేశవ్యాప్తంగా ఈ గౌరవాన్ని దక్కించుకున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ 3వ స్థానంలో ఉంది. తాజాగా చండీగఢ్‌, ఇండోర్‌ను ఓడీఎఫ్‌ నగరాలుగా ప్రకటించారు.
  • మొత్తం 4,041 నగరాలు గుర్తింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, వికారాబాద్‌ నగరాలున్నాయి.
...........
స్వచ్ఛ భారత్‌  : 
ప్రారంభం    :     2014 అక్టోబర్‌ 2
ఉద్దేశం     :     2019 అక్టోబర్‌ 2 నాటికి 62,009కోట్లతో మరుగుదొడ్లు, మంచినీటి సరఫరా, శుభ్రత, నదులలో             కాలుష్య నివారణ మొదలగు పారిశుధ్య కార్యక్రమాలను ఉద్దేశించి ప్రారంభించినదే ఈ పథకం.
ముఖ్యాంశాలు     :     
    -    నిర్మల్‌ భారత్‌ అభియాన్‌ పథకాన్ని ఈ పథకంలో విలీనం చేశారు
    -    ఈ పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వాటా వరుసగా 75:25
    -    స్వచ్ఛ భారత్‌ ప్రచారానికి గాంధీజీ కళ్ళద్దాతో వినూత్నమైన లోగోను రూపొందించిన అనంత్‌(మహారాష్ట్ర),
        ఏక్‌ కదమ్‌ స్వచ్ఛతాకీ ఓర్‌(స్వచ్ఛత వైపు ఒక ముందడుగు) అనే నినాదాన్ని రూపకల్పన చేసిన భాగ్యశ్రీ             (గుజరాత్‌)ను ప్రధాని మోడి అభినందించారు.
    -    2015 నవంబరు 15 నుండి అన్ని సేవలపై స్వచ్ఛభారత్‌ సుంకం 0.5%. 
    -    2019 అక్టోబర్‌ నాటికి దేశంలోని అన్ని కుటుంబాలకు మరుగుదొడ్ల సౌకర్యం కల్పించి బహిరంగ             మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించడం, ఇందుకోసం వ్యక్తిగత కుటుంబ మరుగుదొడ్ల నిర్మాణానికి ఇచ్చే
        ప్రోత్సాహాకాన్ని రూ.10,000 నుంచి రూ.12,000 వరకు పెంచారు. 
    -    స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చత్తీస్‌గఢ్‌లోని ధమ్‌ తరి సమీపంలోని కోటభరి గ్రామస్తులైన             కున్వర్‌ భాయి (105) అనే వృద్ధ మహిళను కేంద్ర ప్రభుత్వం ఎంపిక చేసింది
    -    2016, అక్టోబర్‌ 2 నాటికి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా స్వచ్ఛతపై రూపొందించిన ప్రత్యేక తపాలా             బిళ్లల్ని కమ్యూనికేషన్ల శాఖ మంత్రి మనోజ్‌ సిన్హాతో కలిసి పట్టణాభివృద్ధి శాఖమంత్రి ఎం.వెంకయ్యనాయుడు             విడుదల చేశారు. 
    -    స్వచ్ఛ భారత్‌ టోల్‌ ఫ్రీ నెంబర్‌ 1969. స్వచ్ఛ భారత్‌ కార్యక్రమ పర్యవేక్షణ కేంద్రాన్ని న్యూడిల్లీలోని             రాజ్‌ఘాట్‌ లో ఏర్పాటు చేశారు. 
    -    స్వచ్ఛ సర్వేక్షణ్‌-2016 పేరుతో నిర్వహించిన సర్వేలో మైసూరు ప్రథమ స్థానంలో నిలిచింది. 
    -    స్వచ్ఛ భారత్‌ మిషన్‌ డైరెక్టర్‌-ఐఏఎస్‌ చంద్రకళ (తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లావాసి)
ODF-Open Defecation Free

views: 808

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams