Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్‌లో కార్పొరేషన్‌ల సభ్యుల నియామకం
ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కాపు సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్‌ సభ్యులుగా 8 మందిని నియమిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకున్నారు.
  • రాష్ట్ర మాంసం, పౌల్ట్రీ కార్పొరేషన్‌లోను ఐదుగురు సభ్యుల్ని నియమించారు. మహిళా సంక్షేమ శాఖలో ప్రాంతీయ ఆర్గనైజర్లుగా ముగ్గురిని నియమించారు.
  • కాపు కార్పొరేషన్‌ సభ్యులుగా వెలుగుబంటి వెంకట సత్యప్రసాద్‌(తూర్పుగోదావరి), పిళ్లా శ్రీదేవి (కృష్ణా), వి.హరిబాబు (గుంటూరు), నారపుశెట్టి పాపారావు(ప్రకాశం), కలిమిశెట్టి వెంకటేశ్వర్లు(అనంతపురం), ఎస్‌.వెంకటరమణ (విశాఖపట్నం), వి.విజయకుమార్‌ (చిత్తూరు), పి. వెంకటేశ్వర్లు (కర్నూలు) నియమితులయ్యారు.
  • మాంసం, పౌల్ట్రీ కార్పొరేషన్‌ సభ్యులుగా డీవీఎస్‌ ప్రకాశరావు(శ్రీకాకుళం), ఎస్‌.వెంకటేశ్వరరావు(కృష్ణా), కనగా చిట్టిబాబు(గుంటూరు), సూరా స్వామి రంగారెడ్డి(ప్రకాశం),షేక్‌ ఆషిఫ్‌ బాషా(నెల్లూరు) నియమితులయ్యారు.
  • మహిళా సంక్షేమ శాఖకు ప్రాంతీయ ఆర్గనైజర్లుగా.. శ్రీకాకుళానికి చెందిన సుశీల ఉత్తరాంధ్ర రీజియన్‌కు, పశ్చిమ గోదావరికి చెందిన నాగమణి ఉభయ గోదావరి, కృష్ణా జిల్లా రీజియన్‌కు, చిత్తూరుకు చెందిన వి.పుష్పవతి రాయలసీమ రీజియన్‌కు నియమితులయ్యారు.

views: 819

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams