Current Affairs Telugu Daily

భాగ్యనగరానికి స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఉన్నత పురస్కారం
హైదరాబాద్‌ను బహిరంగ మల, మూత్ర విసర్జన రహితంగా తీర్చిదిద్దడంతో పాటు, ఆయా వ్యర్థాలను శాస్త్రీయంగా శుద్ధి చేసినందుకు గాను.. ఓడీఎఫ్‌++ (ఓపెన్‌ డిఫికేషన్‌ ఫ్రీ)గుర్తింపును జారీ చేస్తూ స్వచ్ఛభారత్‌ మిషన్‌ ఉత్తర్వులు జారీ చేసింది.
దేశవ్యాప్తంగా  ఈ గౌరవాన్ని దక్కించుకున్న మెట్రో నగరాల్లో హైదరాబాద్‌ మూడో స్థానంలో ఉంది. తాజాగా చండీగఢ్‌, ఇండోర్‌లను ఓడీఎఫ్‌++ నగరాలుగా ప్రకటించారు.
మొత్తం 4,041 నగరాలు గుర్తింపునకు దరఖాస్తు చేసుకున్నాయి. ఇందులో తెలంగాణ నుంచి హైదరాబాద్‌, వరంగల్‌, వికారాబాద్‌ నగరాలున్నాయని బల్దియా అధికారులు తెలిపారు.
మూడు నెలలుగా యంత్రాంగం కృషి:
హైదరాబాద్‌ నగరం ఓడీఎఫ్‌++ గుర్తింపు పొందేందుకు అధికార యంత్రాంగం గత మూడు నెలలుగా విశేష కృషి చేసిందని కమిషనర్‌ ఎం.దానకిషోర్‌ పేర్కొన్నారు.
జలమండలి ఎండీగా, బల్దియా కమిషనర్‌గా రెండు శాఖల యంత్రాంగాన్ని సమన్వయం చేసుకుంటూ వ్యర్థాలను శుద్ధి చేసే వ్యవస్థను గాడిలో పెట్టామన్నారు. 
నెలల వ్యవధిలోనే నగరంలోని మరుగుదొడ్లన్నింటి నుంచి వ్యర్థాలను 18 ఎస్టీపీలకు(మురుగు శుద్ధి కేంద్రాలు) అనుసంధానం చేశామన్నారు.
వ్యక్తిగత గృహాల్లో ఉత్పత్తయ్యే వ్యర్థాలను సెప్టిక్‌ ట్యాంకర్లు సేకరించి ఖాళీ స్థలాల్లో, చెరువుల్లో వదిలేవని, ఇప్పుడు ఆయా ట్యాంకర్లకు లైసెన్సులు ఇచ్చి ఎస్టీపీల్లో వదిలే ఏర్పాటు చేశామని చెప్పారు. అవన్నీ ఓడీఎఫ్‌++ గుర్తింపునకు దోహదపడ్డాయని దానకిశోర్‌ గుర్తు చేశారు
ఆ వ్యవస్థను మరింత ఆధునికీకరించి పరిశుభ్రమైన, ఆరోగ్యకరమైన నగరాన్ని సుస్థిరం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు

views: 807



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams