Current Affairs Telugu Daily

పంచాయతీల ఆదాయం పెంపు కోసం ప్రభుత్వం దృష్టి
ప్రస్తుతానికి సొంత రాబడి వాటా 29 శాతమే
కొత్త చట్టం ప్రకారం పెంచుకొనే అవకాశం
ప్రత్యేకంగా నిధులు ఇస్తామని చెప్పిన రాష్ట్ర సర్కారు
2019-20 బడ్జెట్‌లో రూ.1,000 కోట్లు కేటాయింపు
రాష్ట్రంలో పంచాయతీల స్వరూపం మారిపోయింది.  దీంతో వాటి రాబడులూ అంతంత మాత్రంగానే ఉండబోతున్నాయి. సొంత రాబడులను పెంచుకోవటం కొత్త పాలక వర్గాలకు ఒక సవాల్‌గా మారనుంది. 
చిన్న పంచాయతీలకు మనుగడ కష్టమని, అలాంటి యోచన ఏ రాష్ట్రానికైనా ఉన్నట్లైతే దాన్ని ఉపసంహరించుకోవటమే ఉత్తమమని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ ఏర్పాటు చేసిన సుమిత్‌ బోస్‌ కమిటీ స్పష్టం చేసిన సమయంలోనే.. 
తెలంగాణలో ఒకేసారి కొత్తగా 4,383 కొత్త పంచాయతీలు ఏర్పాటయ్యాయి
దీంతో మొత్తం సంఖ్య 12,751కి చేరింది. వీటి ఆవిర్భావంతో ఇప్పుడు రాష్ట్రంలో 95 శాతం మేర పంచాయతీలు చిన్నవిగా మారిపోయాయి. వీటి సొంత ఆర్జనలో ఆస్తి పన్ను ప్రధానమైనది. 
ఇళ్లు తక్కువగా ఉన్నపుడు పన్ను కూడా అంతే స్థాయిలో వస్తుంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఆస్తి పన్ను వార్షిక వసూళ్లు రూ.700 కోట్ల మేర ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందుతున్న నిధులను కలిపి చూస్తే..
2017-18లో గ్రామాలకు అందిన రూ.2,284 కోట్లలోను వాటి సొంత ఆదాయం వాటా 29 శాతం మాత్రమే. 
కానీ రాష్ట్రం ప్రత్యేకంగా నిధులిస్తేమని చెప్పినందున కొంత భరోసా లభించే అవకాశం ఉంది.
అమలు కాని 14వ ఆర్థిక సంఘం సిఫార్సులు:
పంచాయతీల రాబడులను పెంచటం లక్ష్యంగా కేంద్ర 14వ ఆర్థిక సంఘం కొన్ని సిఫార్సులను చేయగా రాష్ట్రంలో అవి ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. పట్టణాలకు సమీపంలోని పంచాయతీల్లోని ఖాళీ స్థలాలపై పన్నును వసూలు చేయాలని, ప్రకటనలపై పన్ను విధింపునకు ప్రభుత్వం ఒక విధానాన్ని తేవాలని, స్థానిక ఆస్తులను పంచాయతీలకు అప్పగించి వాటిని లీజుకు ఇచ్చుకొనే సౌలభ్యాన్ని కల్పించడంవంటివి అందులో ఉన్నాయి.
15వ ఆర్థిక సంఘంపై మరిన్ని ఆశలు:
స్థానిక సంస్థలకు నిధులను ఏ రీతిలో ఇవ్వాలో 15వ ఆర్థిక సంఘం త్వరలో తేల్చనుంది. 
దీని సిఫార్సులు 2020 ఏప్రిల్‌ మొదలుకొని అయిదేళ్ల పాటు అమలులో ఉంటాయి. ఇప్పటికంటే మెరుగైన పద్ధతుల్లో నిధులు రావచ్చని రాష్ట్ర అధికారులు భావిస్తున్నారు.
14వ ఆర్థిక సంఘం ద్వారా 2015-20 మధ్య రాష్ట్రానికి రూ.4,833 కోట్లు వస్తుండగా పంచాయతీలకు అవే ప్రధాన ఆదాయ వనరుగా మారాయి.

views: 654



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams