Current Affairs Telugu Daily

ఆంధ్రప్రదేశ్ కరువు సాయంగా రూ.900 కోట్లు
ఖరీఫ్‌లో కరవు కారణంగా దెబ్బతిన్న పంటలకు పెట్టుబడి రాయితీగా రూ.900 కోట్లు ఇవ్వాలని కేంద్ర బృందం సిఫారసు చేసింది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆధ్వర్యంలోని ఉన్నతస్థాయి కమిటీ ఆమోదం తర్వాత ఈ మొత్తాన్ని విడుదల చేస్తారు. 
2018-19 ఖరీఫ్‌లో వర్షాభావ పరిస్థితుల కారణంగా తీవ్ర కరవు పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 347 కరవు మండలాలను ప్రకటించింది. రూ.1,401 కోట్లు ఇవ్వాలని కేంద్రానికి నివేదిక పంపింది. దీనిపై కేంద్రం నుంచి వచ్చిన అధికారుల బృందం కరవు ప్రాంతాల్లో పర్యటించి వెళ్లింది.

views: 808

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams