Current Affairs Telugu Daily

తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌ విజేత పోలూరి భరత్‌కుమార్‌ రెడ్డి 

తెలంగాణ రాష్ట్ర ఓపెన్‌ ర్యాపిడ్‌ చెస్‌ టోర్నమెంట్‌లో పోలూరి భరత్‌కుమార్‌ రెడ్డి అదరగొట్టాడు.టోర్నీలో నిర్ణీత ఆరు రౌండ్లు ముగిసేసరికి అజేయంగా 6 పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. చాంపియన్‌గా నిలిచే క్రమం లో హాసిత, పి. అభిషేక్, సాకేత్‌ కుమార్, జి. శ్రీనివాస్, సృజన్‌ కీర్తన్, బిపిన్‌ రాజ్‌లపై వరుసగా ఆరు గేముల్లో విజయం సాధించాడు.
మరోవైపు 5.5 పాయింట్లతో శ్రీశ్వాన్, వి. వరుణ్, తరుణ్, శివ రెండోస్థానం కోసం పోటీపడ్డారు. అయితే మెరుగైన టైబ్రేక్‌ స్కోరు ఆధారంగా శ్రీశ్వాన్‌ రన్నరప్‌గా నిలవగా, వరుణ్‌ మూడో స్థానంలో... తరుణ్, శివ వరుసగా నాలుగు, ఐదు స్థానాలతో సంతృప్తిచెందారు

*ఎక్కడ:  అబిడ్స్‌లోని డైమండ్‌ జూబ్లీ హైస్కూల్‌ వేదిక

views: 705

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams