Current Affairs Telugu Daily

బుకర్‌ ప్రైజ్‌ స్పాన్సర్‌షిప్‌కు మ్యాన్‌ గ్రూప్‌ వీడ్కోలు
ఇంగ్లీష్‌ నవలారంగంలో బ్రిటన్‌ అందించే అత్యున్నత పురస్కారం మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌ పేరు మారనుంది.
  • బుకర్‌ ప్రైజ్‌కు 18 సం॥లుగా స్పాన్సర్‌గా కొనసాగుతున్న హెడ్జ్‌ సంస్థ మ్యాన్‌ గ్రూప్‌ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది. అత్యుత్తమ ఇంగ్లీష్‌ నవలకు ఏటా ఈ అవార్డు కింద 50వేల బ్రిటిష్‌ పౌండ్లు(రూ.46.79 లక్షలు) బహుమతిగా అందజేస్తున్నారు.
  • బ్రిటన్‌ రచయిత సెబాస్టియన్‌ ఫాల్క్స్‌ 2018లో ది మ్యాన్‌ గ్రూప్‌ను ప్రజలకు శత్రువుగా అభివర్ణించారు. అంతేకాకుండా కామన్‌వెల్త్‌ దేశాల రచయితకే పరిమితమైన ఈ అవార్డును 2014లో మిగిలిన దేశాలకు విస్తరించడంపై విమర్శలు వచ్చాయి.
  • ఈ నేపథ్యంలో స్పాన్సర్‌ బాధ్యతల నుంచి తప్పుకోవాని  నిర్ణయించింది. దీనివల్ల ఏటా రూ.14.97 కోట్ల ఆర్థిక సాయాన్ని బుకర్‌ సంస్థ కోల్పోనుంది. 1969 నుంచి 2002 వరకూ బుకర్‌ అవార్డుకు మెక్‌కెన్నెల్‌ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది.
  • అప్పట్లో 21 వేల పౌండ్లుగా ఉన్న బహుమతిని 2002లో మ్యాన్‌ గ్రూప్‌ 50 వేల పౌండ్లకు పెంచింది.

views: 944

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams