Current Affairs Telugu Daily

ఎన్నికల సంఘం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు
త్వరలో లోక్‌సభతో పాటు పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఎన్నికల సంఘం ప్రధాన అధికారులకు, ఆయా రాష్ట్రాల సీఎస్‌లకు లేఖ రాసింది. 
పోలింగ్‌ విధులు నిర్వర్తించే ప్రభుత్వ అధికారుల బదిలీలు, నియామకాల విషయంలో స్పష్టమైన సూచనలు చేసింది. అధికారులకు సొంత జిల్లాల్లో పోస్టింగులు ఇవ్వరాదని ఈసీ సూచించింది.
గత నాలుగేళ్లలో వరుసగా మూడేళ్లపాటు పనిచేసిన జిల్లాల్లో ఉద్యోగులకు ఎన్నికల విధులు అప్పగించరాదని తన లేఖలో పేర్కొంది.
2019 మార్చి 31 వరకు ఒకే జిల్లాలో పదవీకాలం మూడేళ్ల పూర్తవ్వనున్న ఉద్యోగులకు సదరు జిల్లాలో పోస్టింగ్‌ ఇవ్వరాదని స్పష్టంచేసింది. 
2017 మే 31కి ముందు సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికల్లో విధులు నిర్వర్తించిన జిల్లాల్లో.. డీఈవో, ఆర్వో, ఏఆర్వో, ఎస్సైలకు తిరిగి పోస్టింగ్‌లు ఇవ్వరాదని సూచించింది. 
2019లో లోక్‌సభతో పాటు ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా ఎన్నికల సంఘం ఈ లేఖలు రాసింది.
ఎన్నికల సంఘం 1950 జనవరి 25
ప్రధాన ఎన్నికల కమిషనర్ : సునీల్ అరోరా
అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు: 
ఏపీ, అరుణాచల్‌ప్రదేశ్‌, ఒడిశా, సిక్కిం

views: 748

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams