‘ట్రైన్ 18’ పేరు ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’గా మార్పు
భారత్లో తొలి ఇంజిన్రహిత రైలుగా గుర్తింపు పొందిన ‘ట్రైన్ 18’ పేరు మారింది. స్వదేశీ ఇంజినీర్లు పూర్తిగా స్వదేశంలోనే తయారు చేయడంతో ఈ రైలును ‘వందే భారత్ ఎక్స్ప్రెస్’గా పిలువబోతున్నట్లు రైల్వేమంత్రి పీయూష్ గోయల్ 2019 జనవరి 27న ప్రకటించారు.
‘వందే భారత్ ఎక్స్ప్రెస్’లో 16 బోగీలుంటాయి. రూ.97 కోట్ల వ్యయంతో చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో నిర్మించారు.
డిల్లీ-వారణాసి మధ్య ఈ రైలుప్రయాణిస్తుంది. మొత్తం 755 కి.మీ. ప్రయాణాన్ని దాదాపు 8 గంటల్లో పూర్తి చేస్తుంది.