Current Affairs Telugu Daily

పరీక్షపే చర్చ 2.0కు 34 మంది తెలుగు విద్యార్థుల ఎంపిక
పరీక్ష సమయంలో కలిగే ఒత్తిడి, భయం, ఆందోళనలను జయించేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాలపై విద్యార్థులకు అవగాహన కోసం కేంద్రం చేపట్టిన ప్రధాని నరేంద్రమోడితో ముఖాముఖి(పరీక్ష పే చర్చ 2.0)కి మొత్తం 34 మంది తెలుగు రాష్ట్రాల విద్యార్థుల ఎంపికయ్యారు. వీరిలో 9, 10, 11, 12 తరగతులకు చెందిన విద్యార్థులు ఆంధ్రప్రదేశ్‌ నుంచి 19 మంది, తెలంగాణ నుంచి 15 మంది ఉన్నారు.
  • ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విభాగాల్లో రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరిని చొప్పున ఎంపిక చేశారు. ప్రధాని మోడి రచించిన ‘ఎగ్జామ్‌ వారియర్స్‌’ పుస్తకంపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు ఆన్‌లైన్‌లో పరీక్ష నిర్వహించి అన్ని రాష్ట్రాల నుంచి ప్రతిభావంతుల్ని ఎంపిక చేశారు. 

views: 731



Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams