Current Affairs Telugu Daily

బుకర్‌ ప్రైజ్‌కు మ్యాన్‌ గ్రూప్‌ గుడ్‌బై
  • ఆంగ్ల నవలారంగంలో బ్రిటన్‌ అందించే అత్యున్నత పురస్కారం ‘మ్యాన్‌ బుకర్‌ ప్రైజ్‌’ పేరు మారనుంది. బుకర్‌ ప్రైజ్‌కు 18 ఏళ్లుగా స్పాన్సర్‌ కొనసాగుతున్న  సంస్థ ‘మ్యాన్‌ గ్రూప్‌’ ఈ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపింది.
  •  అత్యుత్తమ ఆంగ్ల నవలలకు ఏటా ఈ అవార్డు కింద 50వేల బ్రిటిష్‌ పౌండ్లు(రూ.46.79 లక్షలు) బహుమతిగా అందజేస్తున్నారు. బ్రిటన్‌ రచయిత సెబాస్టియన్‌ ఫాల్క్స్‌ గతేడాది మ్యాన్‌ గ్రూప్‌ను ప్రజలకు శత్రువుగా అభివర్ణించారు. అంతేకాకుండా కామన్‌వెల్త్‌ దేశాల రచయితలకే పరిమితమైన ఈ అవార్డును 2014లో మిగిలిన దేశాలకు విస్తరించడంపై విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో స్పాన్సర్‌ బాధ్యతల నుంచి తప్పుకోవా లని  నిర్ణయించింది. దీనివల్ల ఏటా రూ.14.97 కోట్ల ఆర్థిక సాయాన్ని బుకర్‌ సంస్థ కోల్పోనుంది. 
  • 1969 నుంచి 2002 వరకూ బుకర్‌ అవార్డుకు మెక్‌కెన్నెల్‌ సంస్థ స్పాన్సర్‌గా వ్యవహరించింది. అప్పట్లో 21 వేల పౌండ్లుగా ఉన్న బహుమతిని 2002లో మ్యాన్‌ గ్రూప్‌ 50 వేల పౌండ్లకు పెంచింది

views: 781Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams