Current Affairs Telugu Daily

ఉత్తర అమెరికాలో 10 అంగుళాల సామండర్‌ గుర్తింపు
నీటి గుహల్లో ఉండే అరుదైన సకశేరుకం సాలమండర్‌ను ఉత్తర అమెరికాలో గుర్తించారు. ఇది దాదాపు 10 అంగుళాల పొడవు ఉంది.
  • తోక కలిగిన కప్ప లేదా బల్లిలా ఉండే సకశేరుకం సాలమండర్‌. ఇది గుహల్లోనే పెరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్‌ టెన్నీస్సీ- నాక్స్‌విల్లీ విద్యార్థి నికోస్‌ గ్లాడ్‌స్టోన్‌ తెలిపారు. గుహల్లో చాలా ప్రతికూల వాతావరణం ఉంటుంది.
  • అలాంటి ప్రదేశంలో సాలమండర్‌ పేరుగుదల ఆశ్చర్యం కలిగిస్తుందని అంటున్నారు. చేప తర్వాత వలస గుహల్లో జీవించే జాతి ఇదేనని చెబుతున్నారు. ఇవి తూర్పు టెన్నీస్సీ ప్రాంతంలోని పది చోట్ల మాత్రమే కనిపిస్తుంటాయి.
  • ఈ జాతి అంతరించిపోకుండా కాపాడుకోవాలని 2003లో నిర్ణయం తీసుకున్నారు. తాజా పరిశోధన ఈ దిశగా కొంత దోహదం చేస్తుందని అనుకుంటున్నారు.

views: 807

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams