Current Affairs Telugu Daily

శరీరంలో అమర్చే కృత్రిమ ఉపకరణాలకు ‘మైక్రో ఫ్లూయిడిక్‌ డయోడ్‌’ల తయారీ
శరీరంలో అమర్చే కృత్రిమ ఉపకరణాల్లో వినియోగించేందుకు ‘మైక్రో ఫ్లూయిడిక్‌ డయోడ్‌’లను పరిశోధకులు సృష్టించారు.
  • చాలా సూక్ష్మ పరిమాణంలో ఉండేలా 3డీ ముద్రణ పరిజ్ఞానంతో తొలిసారి వీటిని వారు రూపొందించారు. ఇలాంటి 10 డయోడ్‌ను ఒకదాని పక్కన మరొకటి పేర్చితే ఒక వెంట్రుక మందానికి సరితూగుతాయి.
  • అమెరికాలోని మేరీల్యాండ్‌ వర్సిటీ పరిశోధకులు వీటిని తయారుచేశారు. ఔషధాలు, పోషకాల వంటి ద్రావణాలను ఒకే దిశలో ప్రవహింపజేసేందుకు మైక్రో ఫ్లూయిడ్‌ సర్క్యూట్లలో ఈ డయోడ్‌ను వినియోగిస్తుంటారు.
  • సోల్‌-జెల్‌ అనే ప్రక్రియ ద్వారా చవగ్గా తక్కువ సమయంలోనే వీటిని ముద్రించినట్లు పరిశోధకులు తెలిపారు. లీకేజీలకు అవకాశం ఇవ్వకుండా కచ్చితత్వంతో ఇవి పనిచేస్తాయని వివరించారు.

views: 710

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams