Current Affairs Telugu Daily

అకాంగువా పర్వతాన్ని అధిరోహించిన రెండో భారతీయుడు తరుణ్‌ జోషి
దక్షిణార్ధగోళంలో అత్యంత ఎత్తయిన అకాంగువా మంచు పర్వతాన్ని హైదరాబాద్‌ పోలీస్‌ సంయుక్త కమిషనర్‌ డాక్టర్‌ తరుణ్‌ జోషి  2019 జనవరి 24న అధిరోహించారు.
  • అర్జెంటీనాకు సమీపంలో ఉన్న ఈ మంచు పర్వతం ఎత్తు 22,637 అడుగు. ఈ పర్వతాన్ని డాక్టర్‌ తరుణ్‌ జోషి సహా ముగ్గురు సభ్యులతో కూడిన బృందం కేవలం 14.15 గంటల్లో ఎక్కింది.
  • ఆ సమయంలో అక్కడి వాతావరణం మైనస్‌ 25 డిగ్రీ సెల్సియస్‌ ఉంది. అనంతరం ముగ్గురూ సురక్షితంగా కిందికి చేరుకున్నారు. ఎవరెస్ట్‌, కాంచన గంగా పర్వతాల తరహాలోనే అర్జెంటీనాలో ఉన్న అకాంగువా మంచు పర్వతాన్ని అధిరోహించేందుకు పర్వతారోహకులు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.
  • ఈ పర్వతం అధిరోహించిన రెండో భారతీయుడిగా తరుణ్‌ జోషి రికార్డు సృష్టించారు. 

views: 755

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams