Current Affairs Telugu Daily

ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత ఒసాకా
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత ఒసాకా
నంబర్‌ వన్‌ ర్యాంకు దక్కించుకున్న మొదటి ఆసియా క్రీడాకారిణి
2019 ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ మహిళ సింగిల్స్‌లో జపాన్ యువ సంచలనం నవోమి ఒసాకా ట్రోఫీని ముద్దాడింది. 
ఆసక్తికరంగా జరిగిన ఈ సమరంలో చెక్‌ క్రీడాకారిణి పెట్టా క్విటోవాను ఇంటి దారి పట్టించింది. 7-6(2), 5-7, 6-4 తేడాతో క్విటోవా మీద గెలుపొందింది.  
2018లో టెన్నిస్‌ స్టార్ సెరెనా విలియమ్స్‌ను ఓడించి యూఎస్‌ గ్రాండ్‌ స్లామ్ గెలిచిన ఒసాకా(21) అదే ఫామ్‌ను 2019లో కూడా కొనసాగించింది. 
ఈ విజయంతో నాలుగో సీడ్ ఒసాకా సింగిల్స్‌లో నంబరు వన్‌ ర్యాంకు దక్కించుకొంది. ఇద్దరు సూపర్‌ ఫామ్‌లో ఉండటంతో మ్యాచ్‌లో హోరాహోరీగా తలపడ్డారు. 
2016లో కత్తి దాడి అనంతరం క్విటోవా కెరీర్‌ ప్రమాదంలో పడిందని అందరూ భావించారు. కానీ దాన్నుంచి కోలుకొని, ఫైనల్‌కు చేరుకొని, ఒసాకాకు గట్టి పోటీని ఇచ్చింది ఈ చెక్‌ తార.

views: 799

June Month Telugu Current Affairs e-Magazine
Download


Current affairs for TSPSC, APPSC (group-1, group-2, ....etc), UPSC, BSRB, RRB and all other competitive exams